AIATSL Recruitment : ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో పోస్టుల భర్తీ

ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు సెప్టెంబర్ 18, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆప్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను టెస్టిమోనియల్‌లు/సర్టిఫికెట్‌ల కాపీలతో పాటు పోస్ట్ ద్వారా లేదా డ్రాప్-బాక్స్ ద్వారా వ్యక్తిగతంగా పంపాల్సి ఉంటుంది.

AIATSL Recruitment

AIATSL Recruitment : ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 998 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో హ్యాండీమ్యాన్ , యుటిలిటీ ఏజెంట్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : One Nation, One Election : ఒకే దేశం, ఒకే ఎన్నికలను స్వాగతించిన కాంగ్రెస్ నేత

భర్తీ చేయనున్న 998 పోస్టులలో 971 ఖాళీలు హ్యాండీమ్యాన్ పోస్టులు కాగా, యుటిలిటీ ఏజెంట్ 20 పురుషులకు 7 మహిళలు కోసం కేటాయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి హ్యాండీమ్యాన్ పోస్టులకు SSC /10వ తరగతి ఉత్తీర్ణత. ఇంగ్లిష్ లాంగ్వేజ్ చదివి అర్థం చేసుకోగలగాలి. స్థానిక మరియు హిందీ భాషల పరిజ్ఞానం, అంటే అర్థం చేసుకోవడం , మాట్లాడే సామర్థ్యం అవసరం. యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు గాను SSC /10వ తరగతి ఉత్తీర్ణత. స్థానిక హిందీ భాషల పరిజ్ఞానం, అంటే అర్థం చేసుకోవడం మరియు మాట్లాడే సామర్థ్యం అవసరం. అభ్యర్ధుల వయస్సు 33 సంవత్సరాల లోపు ఉండాలి.

READ ALSO : IAF Trishul exercise : పాక్, చైనా సరిహద్దుల్లో ఐఏఎఫ్ త్రిశూల్ విన్యాసాలు

ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు సెప్టెంబర్ 18, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆప్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను టెస్టిమోనియల్‌లు/సర్టిఫికెట్‌ల కాపీలతో పాటు పోస్ట్ ద్వారా లేదా డ్రాప్-బాక్స్ ద్వారా వ్యక్తిగతంగా పంపాల్సి ఉంటుంది.

READ ALSO : BCCI Media Rights: బీసీసీఐకి డబ్బేడబ్బు.. వచ్చే ఐదేళ్ల కాలానికి ఆరువేల కోట్లు .. ఒక్కో మ్యాచ్ విలువ 67.76కోట్లు

ఎంపికైన వారికి నెలకు ప్రారంభ జీతంగా హ్యాండీ మ్యాన్ కు -21,330/- యుటిలిటీ ఏజెంట్ (పురుషుడు)-21,330/- చెల్లిస్తారు. దరఖాస్తులు అందించాల్సిన చిరునామా ; HRD డిపార్ట్‌మెంట్, AI ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, GSD కాంప్లెక్స్, సహార్ పోలీస్. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://www.aiasl.in/ పరిశీలించగలరు.