BCCI Media Rights: బీసీసీఐకి డబ్బేడబ్బు.. వచ్చే ఐదేళ్ల కాలానికి ఆరువేల కోట్లు .. ఒక్కో మ్యాచ్ విలువ 67.76కోట్లు

ఐదేళ్ల కాలంలో టీమిండియా స్వదేశంలో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్ లు సహా మొత్తం 88 అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుంది.

BCCI Media Rights: బీసీసీఐకి డబ్బేడబ్బు.. వచ్చే ఐదేళ్ల కాలానికి ఆరువేల కోట్లు .. ఒక్కో మ్యాచ్ విలువ 67.76కోట్లు

BCCI Media rights

BCCI: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ)కు కాలసుల వర్షం కురుస్తోంది. వచ్చే ఐదేళ్ల కాలానికి భారత జట్టు స్వదేశీ సిరీస్‌ల టీవీ, డిజిటల్ మీడియా ప్రసార హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. టీవీ, డిజిటల్ మీడియా హక్కులకోసం ఈ ఏడాది బీసీసీఐ విడివిడిగా ఈ-బిడ్స్‌ను ఆహ్వానించింది. ఇందులో స్టార్ ఇండియా, సోనీ, వయాకామ్ 18తో పాటు పలు సంస్థలు పాల్గొన్నాయి.

BCCI president to visit Pakistan : ముంబయి దాడుల తర్వాత మొదటిసారి పాక్‌లో పర్యటించనున్న బీసీసీఐ ప్రతినిధులు

వయాకామ్ డిజిటల్‌కు రూ. 3,101 కోట్లు, టీవీ ప్రసార హక్కులకు రూ. 2,862 కోట్లు చెల్లించింది. రెండు విభాగాలు కలిపి మొత్తం 5,963 కోట్లు బీసీసీఐకి ఆదాయం సమకూరింది. సెప్టెంబర్ 22న సొంతగడ్డపై టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌తో వయాకామ్ ఒప్పందం అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం 2028 మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతుంది.

BCCI : టీమిండియా ప్లేయర్స్‌కు బీసీసీఐ స్వీట్ వార్నింగ్.. ముఖ్యంగా కోహ్లీకి..!

ఐపీఎల్ (టీవీ), ఐసీసీ టోర్నీలు మినహా అన్ని ప్రధాన క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు వయాకామ్ చేతిలో ఉన్నట్లయింది. ఇదిలాఉంటే ఈ ఐదేళ్ల కాలంలో టీమిండియా స్వదేశంలో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్ లు సహా మొత్తం 88 అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుంది. దీంతో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 67.76 కోట్లు. గత ఒప్పందం ప్రకారం ఒక్కో మ్యాచ్ విలువ రూ. 60 కోట్లు ఉండేది. ప్రస్తుతం ఒక్కో మ్యాచ్ విలువ అదనంగా 7.76కోట్లు పెరిగింది.