Mazagon Dock Recruitment : ముంబయిలోని మజ్‌గావ్‌ డాక్‌ పివ్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. అర్హతలున్నవారు జులై 26, 2023లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://mazagondock.in/ పరిశీలించగలరు.

Mazagon Dock Recruitment : ముంబయిలోని మజ్‌గావ్‌ డాక్‌ పివ్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ

Vacancy for Apprentice Posts

Updated On : July 22, 2023 / 2:32 PM IST

Mazagon Dock Recruitment : ముంబయిలోని మజ్‌గావ్‌ డాక్‌ షివ్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 466 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డ్రాఫ్ట్‌మ్యాన్‌ (మెకానికల్‌), ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, పైవ్‌ ఫిట్టర్‌, స్టక్చరల్‌ ఫిట్టర్‌, ఎలక్టానిక్‌ మెకానిక్‌, వెల్డర్, కార్పెంటర్‌, రిగ్గర్‌, వెల్డర్‌ ,ఎలక్ట్రికల్‌ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్టులను అనుసరించి విద్యార్హతలకు సంబంధించి అభ్యర్థులు ఎనిమిదో తరగతి, పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

READ ALSO : viral video : పాములతో వ్యక్తి చలగాటం.. వణుకు పుట్టించిన వీడియో

ట్రేడ్‌ అప్రెంటిస్‌ (గ్రూవ్‌ఎ) ఖాళీలు 188 ఉన్నాయి. 2సంవత్సరాల కాలపరిమితి. పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 01.07.2023 నాటికి 15-19 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైనవారికి మొదటి సంవత్సరంలో మొదటి మూడునెలలు నెలకు రూ.3000, తర్వాతి 9 నెలలు నెలకు రూ.6000 చెల్లిస్తారు. రెండో ఏడాది నెలకు రూ.6600 చెల్లిస్తారు. ట్రేడ్‌ అప్రెంటిస్‌ (గ్రూప్‌-బి) ఖాళీలు 225 ఉన్నాయి. ఏడాది కాలపరిమితి. ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 01.07.2023 నాటికి 16-21 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైనవారికి ఏడాదిపాటు నెలకు రూ.7700 – రూ.8050 చెల్లిస్తారు.

READ ALSO : HackStop : సైబర్ దాడుల నుండి సమాజాన్ని కాపాడే రెడ్‌సెక్‌ఆప్స్ ‘హ్యాక్ స్టాప్’.. ఆగస్టు 15న లాంచింగ్..

ట్రేడ్‌ అప్రెంటిస్‌ (గ్రూవ్‌-బి) ఖాళీలు 53 ఉన్నాయి. 2 సంవత్సరాల కాలపరిమితి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 01.07.2023 నాటికి 14-18 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైనవారికి ఏడాదిపాటు నెలకు రూ.7700 – రూ.8050 చెల్లిస్తారు.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. అర్హతలున్నవారు జులై 26, 2023లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://mazagondock.in/ పరిశీలించగలరు.