NIOH Recruitment : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ లో పోస్టుల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌-1, ల్యాబొరేటరీ అటెండెంట్‌.1 పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను అహ్మదాబాద్‌లోనే నిర్వహిస్తారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అన్ని పోస్టులకూ గరిష్ట వయసు 30 సంవత్సరాలు.

NIOH Recruitment : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ లో పోస్టుల భర్తీ

NIOH Recruitment

Updated On : July 22, 2023 / 2:21 PM IST

NIOH Recruitment : ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ (ఎన్‌ఐఓ హెచ్‌) అహ్మదాబాద్‌లో టెక్నికల్‌ క్యాడర్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్స్‌)1. కెమిస్ట్రీ 6, బయోకెమిస్టీ-ఓ బయోమెడికల్‌8, మ్రైక్రోబయోలజీ8, టాక్సికాలజీ1, ఎన్నిరాన్‌మెంటల్‌ సైన్స్‌1,ఎంఎల్‌టీ8 ఫిజియాలజీ2, ఓ పబ్లిక్‌ హెల్త్‌4, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్1, ఫిజిక్స్‌1, టెక్నీషియన్‌16, ల్యాబొరేటరీ అటెండెంట్‌10 ఉన్నాయి.

READ ALSO : Deers : పంటపొలాల్లో గంతులేస్తున్న జింకలు

పోస్టుల వారిగా అర్హతల విషయానికి వస్తే టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్స్‌) పోస్టుకు ఎలక్టికల్‌/ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత ఉండాలి సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఎలక్టికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌ ఫన్ట్‌క్లాసులో పాసై ఉండాలి. గరిష్ట వయసు 80 సంవత్సరాలు. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (బయోకెమిస్ట్రీ)కి సంబంధించి బయోకెమిస్ట్రీ సబ్జెక్టుతో డిగ్రీ ఫస్ట్ క్లాస్ కలిగి ఉండాలి.

టెక్నికల్‌ అసిస్టెంట్‌ (బయోమెడికల్‌)పోస్టుకు గాను బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లామా ఫన్ట్‌క్లాన్‌, లేదా బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌ ఫన్ట్‌క్లాన్‌, లేదా బయోమెడికల్‌ సబ్జెక్టుతో డిగ్రీ ఫన్ట్‌క్లాన్‌ ఉత్తీర్ణత ఉండాలి. టెక్నికల్‌ అసిస్టెంట్‌ మైక్రోబయాలజీ పోస్టుకుగాను మైక్రోబయాలజీ సబ్జెక్టుతో డిగ్రీ ఫన్ట్‌క్లాన్‌ ఉండాలి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ట్యాక్సికాలజీ) పోస్టుకు గాను టాక్సికాలజీ/ఫోరెన్సిక్‌ సబ్జెక్టుతో డిగ్రీ ఫన్ట్‌క్లాన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

READ ALSO : Huge Crowds at Waterfalls : ప్రకృతి అందాలు.. పర్యాటకుల పరవశం

టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) పోస్టు విషయానికి వస్తే ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ సబ్జెక్టుతో డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎంఎల్‌టీ) పోస్టుకుగాను మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ సబ్జెక్టుతో డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌ ఉండాలి. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఫిజియాలజీ) పోస్టుకు సైన్స్‌ డిగ్రీ (ఫిజియాలజీ) ఫన్ట్‌క్లాన్‌ ఉండాలి. టీఏ (పబ్లిక్‌ హెల్త్‌) పోస్టుకు సైన్స్‌ డిగ్రీ (పబ్లిక్‌ హెల్త్‌) ఫస్ట్‌క్లాన్‌ అవసరం.

టీఏ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌) పోస్టుకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌లో డిప్లామా ఫన్ట్‌క్లాన్‌, లేదా ఐటీ/నీఎన్‌లో బీఈ/బీటెక్‌ ఫన్ట్‌క్లాస్ లో పాసై ఉండాలి. టీఏ (ఫిజిక్స్‌) పోస్టుకుగాను సైన్స్‌ డిగ్రీ (ఫిజిక్స్‌) ఫస్ట్‌క్లాన్‌ ఉండాలి. టెక్నీషియన్‌-1 పోస్టుకు సైన్స్‌ సబ్దెక్టులతో ఇంటర్మీడియట్‌. 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీలో/కంప్యూటర్‌/ కెమికల్‌ టెక్నాలజీ/ ఇండస్ట్రియల్‌ సేష్టీలో డిప్లొమా ఉండాలి. ల్యాబొరేటరీ అటెండెంట్‌-1 పోస్టుకు టెన్త్ 50 శాతం మార్కులతో పాసవ్వాలి. ఏడాది ల్యాబొరేటరీ
అనుభవం/ట్రేడ్‌ సర్టిఫికెట్‌ అవసరం.

READ ALSO : America : అమెరికాలో బియ్యం కోసం బారులు

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌-1, ల్యాబొరేటరీ అటెండెంట్‌.1 పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను అహ్మదాబాద్‌లోనే నిర్వహిస్తారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అన్ని పోస్టులకూ గరిష్ట వయసు 30 సంవత్సరాలు. టెక్నీషియన్‌కు 28, ల్యాబొరేటరీ అటెండెంట్‌కు 25 సంవత్సరాలు. ప్రత్యేక కేటగిరీలఅభ్యర్థులకు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే… వేర్వేరు అప్లికేషన్‌లను పంపాలి. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషన్‌ ఉంటుంది. ఎంపికైనవారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే
ఐసీఎంఆర్ లేదా ఎన్‌ఐఓ హెచ్‌ కార్యాలయాల్లో ఎక్కడైనా నియమించవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా ఆగస్టు 4, 2023 ను నిర్ణయించారు. వివరాలకు వెబ్ సైట్ ; https://www.nioh.org/ పరిశీలించగలరు.