Job Vacancies : పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ లో కెమిస్ట్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.

Power Generation Corporation Limited

Job Vacancies : తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 కెమిస్ట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Natural Farming : జీవన ఎరువులు వాడుకునే విషయంలో రైతులు అనుసరించాల్సిన పద్ధతులు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఎంపికైవారికి నెలకు రూ.65,600 – రూ.1,31,220 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు. అభ్యర్ధుల వయసు 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

READ ALSO : Crop Damaging Birds : పంటకు నష్టం కలిగించే పక్షుల విషయంలో అనుసరించాల్సిన నియంత్రణా పద్ధతులు

ఉద్యోగాలకు ఎంపికైనవారు సంస్థలో విధిగా 5 సంవత్సరాలు పనిచేయనున్నట్లు సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 29న దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు గడువుగా నిర్ణయించారు. డిసెంబర్ 3న రాత పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://tsgenco.co.in/ పరిశీలించగలరు.