Crop Damaging Birds : పంటకు నష్టం కలిగించే పక్షుల విషయంలో అనుసరించాల్సిన నియంత్రణా పద్ధతులు

సూర్యరశ్మి రిబ్బన్‌ పైన బడి ధగధగ మెరుస్తూ గాలి వీచినప్తుడు ఒకరకమైన శబ్దము చేస్తూ పంటలపై పక్షులు వాలకుండా చేస్తుంది. రిబ్బన్‌ పద్ధతిలో అన్ని రకములైన అహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు , పండ్లతోటలను పక్షుల బారి నుండి కాపాడవచ్చు.

Crop Damaging Birds : పంటకు నష్టం కలిగించే పక్షుల విషయంలో అనుసరించాల్సిన నియంత్రణా పద్ధతులు

crop damaging birds

Crop Damaging Birds : పంటపొలాల్లో విత్తనం వేసింది మొదలు పంట చేతికి వచ్చేంత వరకు పక్షుల బెడద అధికంగా ఉంటుంది. వీటి వల్ల పంటకు నష్టం కలుగుతుంది. ముఖ్యంగా జొన్న, మొక్కజొన్న, దానిమ్మ, జామ వంటి పంటల సాగులో పక్షుల కారణంగా పంట ఉత్పత్తులకు నష్టం జరుగుతుంది. పక్షుల బారి నుండి పంటలను కాపాడుకునేందుకు రైతులు వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. అలాంటి వాటిలో కొన్ని పద్ధతులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Herbicide Safety Tips : రైతులు పంటపొలాల్లో కలుపు మందులు వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రిబ్బన్‌ పద్ధతి:

పంట ఎత్తు కంటే ఒక అడుగు ఎత్తు గల రెండు కర్రలను ఉత్తర, దక్షిణదిశలలో పాతుకోవాలి. ఒక ప్రక్క ఎరుపు రంగు మరొక ప్రక్క తెలుపు రంగు కలిగిన అర అంగుళం వెడల్పు 30 అడుగుల పొడవు గల రిబ్బన్‌ ౩ లేదా 4 మెలికలను త్రిప్పి కర్రలను 10 మీ. దూరములో నాటి కట్టుకోవాలి. పక్షుల ఉద్భతి ఎక్కువగా ఉన్న ఎడల కర్రల మధ్య దూరము 5మీ తగ్గించి కట్టాలి. సూర్యరశ్మి రిబ్బన్‌ పైన బడి ధగధగ మెరుస్తూ గాలి వీచినప్తుడు ఒకరకమైన శబ్దము చేస్తూ పంటలపై పక్షులు వాలకుండా చేస్తుంది. రిబ్బన్‌ పద్ధతిలో అన్ని రకములైన అహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు , పండ్లతోటలను పక్షుల బారి నుండి కాపాడవచ్చు.

అకుచుట్టు పద్ధతి:

మొక్కజొన్న ఆకులను, గింజలు పాలుపోసుకొనే’ దశలో కంకి చుట్టూ చుట్టి పక్షుల దృష్టిని మరల్చవచ్చును. గట్ల నుండి ౩ లేదా 4 వరుసల వరకు
అకులను చుట్టి వక్షుల దృష్టిని మరల్చి వంటలను రక్షించ వచ్చు. తక్కువ విస్తీర్ణము కల్గిన పంటలకు ఇది అనువైన వద్ధతి.

READ ALSO : Metta Crops Cultivation : మెట్టపైర్ల సాగులో పాటించాల్సి మెళుకువలు

వేపగింజల కషాయం పిచికారి పద్ధతి ;

వేపగింజల కషాయం తయారీకి తగిన మొత్తంలో వేపగింజలను సేకరించి ఎండబెట్టకోవలెను. గింజలు బాగా ఎండిన తరువాత గింజపై పొట్టును వేరు చేసి గింజలను తిరిగి ఒకరోజు ఎండబెట్టాలి. తరువాత ఈ గింజలను బాగా పొడిగా చేసి తడిలేని డబ్బాలలో పోసి నిల్వ ఉంచుకోవాలి. వేప కషాయం పిచికారి చేయడానికి, దానికి ముందు రోజు ఈ గింజల పొడిని ఒక పలుచటి గుడ్డలో కట్టి, ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకొని గింజల పొడి ఉన్న మూట ఆ నీటిలో మునుగునట్లు ఉంచుకోవాలి. రాత్రి సమయం మొత్తం ఆ పొడి నీటిలో నాని చక్కటి కషాయం తయారవుతుంది.

మరునటి రోజు ఉదయం అ మూటను పాత్రలో నీటిలో గట్టిగా పిండి వడపోసి కషాయాన్ని తయారుచేనుకోవాలి. ఈ రకంగా తయారు చేసిన వేప గింజల కషాయాన్ని 20 మిలీ. ఒక లీటరు వీటికి కలిపి పంటపై పిచికారి చేసినచో వక్షులు గింజలను తినడానికి విముఖత చూపుతాయి. ఫలితంగా పక్షుల బారి నుండి వంటను సమర్ధవంతంగా కాపాడుకోవచ్చును. ఈ పద్ధతి ద్వారా 7 నుండి 10 రోజుల వరకు పక్షులు పంటను నష్టపరచకుండా కాపాడవచ్చు.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

కోడి గ్రుడ్డు ద్రావణం పిచికారి:

కుళ్ళిన కోడిగ్రుడ్లు సేకరించి వాటిని వగులగొట్టి ద్రావణాన్ని వేరువరచాలి. ఈ ద్రావణాన్ని 25 మిలీ. ఒక లీటరు నీటికి కలిపి గింజలు పాలుపోనుకొనే దశలో పంటపై పిచికారి చేసినట్లైతే ఆ వాసనలు పక్షులకు తీవ్రమైన చిరాకును కలుగచేస్తాయి. అందువలన అవి పంట పొలాల వైపునకు రాకుండా దూరంగా పారిపోతాయి. దీని ద్వారా వచ్చే వానన సుమారు 10-15 రోజుల వరకు పనిచేసి పక్షులను రాకుండా చేస్తుంది. అవనరమైతే రెండవ విడుత కూడా పిచికారి చేసుకోవచ్చు. ఈ వద్ధతికయ్యే ఖర్చు అతి న్వల్పం. ఒక ఎకరాకు 25 గ్రుడ్లు అవసరం అవుతాయి.