Metta Crops Cultivation : మెట్టపైర్ల సాగులో పాటించాల్సి మెళుకువలు

వాలుకడ్డంగా దుక్కిడున్నటం, విత్తటం, అంతరకృషి చేయటం వలన నీటి ఒరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోనికి ఇంకింప చేయవచ్చు. పొలంలో కాలువలు మరియు బోదెలను ఏర్పాటు చేయాలి. తద్వారా తక్కువ వర్షపాతం నమోదైనమ్పుడు తేమ నంరక్షించబడుతుంది.

Metta Crops Cultivation : మెట్టపైర్ల సాగులో పాటించాల్సి మెళుకువలు

Metta Crops Cultivation

Metta Crops Cultivation : తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు వ్యవసాయం వర్షాధారంగానే జరుగుతుంది. వ్యవసాయానికి ఎర్రనేలలు, నల్లనేలలు, ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. అన్ని నేలల్లో మెట్ట వ్యవసాయం జరుగుతుంది. వర్షం తక్కువగాను, సకాలంలో పడక పోవటం వలన పంట దిగుబడిలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి మెట్టసాగులో భూసంరక్షణ , అధునిక మెట్ట వ్యవసాయ సాగు పద్దతులను అనుసరించటం ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చు.

READ ALSO : Heart Diseases : గుండె సంబంధిత వ్యాధులకు కారకాలు, నివారణ మార్గాలు !

ఎర్రనేలలు లోతు తక్కువ , నీటిని నిల్వ వుంచుకానే సామర్థం కూడా తక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలో అధిక వర్షం లేదంటే ఎదతెరిపి లేకుండా తుఫాను వర్షాలు కురిసినప్పుడు నీరు ఒరవడికి సారవంతమైన పైపొర మట్టి, అందులోని పోషక పదార్థాలు నష్టపోవటం జరుగుతుంది. దీనిని రక్షించటానికి కాంటూరు గట్లు, జీవగ్లతో వాలుకు అడ్డంగా సేద్యం చేయాలి. కాబట్టి మెట్ట వ్యవసాయం భూసంరక్షణ చాలా ముఖ్యమైనది.

వాలుకు అడ్డంగా దుక్కిదున్నటం, విత్తటం, అంతరకృషి చేయటం వలన నీటి ఒరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోనికి ఇంకింప చేయవచ్చు. పొలంలో కాలువలు మరియు బోదెలను ఏర్పాటు చేయాలి. తద్వారా తక్కువ వర్షపాతం నమోదైనమ్పుడు తేమ సంరక్షించబడుతుంది. అలాగే అధిక వర్షపాతం కురిసినప్పుడు మురుగు నీరు బయటకు వెళ్ళుటకు వీలవుతుంది. బెట్టపరిస్థితులలో ఒకటి లేక రెండుసార్లు దంతి. సహాయంతో తేలికగా అంతరకృషి చేస్తే దుమ్ము రక్షక కవచంగా ఏర్పడి తేమ సంరక్షించబడుతుంది.

READ ALSO : Integrated Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న.. చార్టర్డ్ అకౌంటెంట్

వాలు కలిగిన నేలల్లో ప్రతి 50 మీటర్ల దూరానికి 0.63 ఘనపు మీటర్ల పరిమాణంలో కాంటూరు గట్లు వేయాలి. నేల పైపార గట్టిపడే భూములకు ఎకరాకు 15 టన్నుల ఇసుకను తోలి కలియదున్నాలి. ఇటువంటి భూముల్లోవేరుశనగ ఊడలు సులభంగా దిగి కాయలు బాగా వూరడానికి అవకాశముంటుంది. వర్షపు నీరు బాగా భూమి లోపలికి ఇంకి నీటి వృధా తగ్గుతుంది. జొన్న వేరుశనగ వంటల్లో అంతరపంటగా కందిని వేసేటప్పుడు, కందితోపాటు ఒరవడిని అరికట్టే పంటలైన ఉలవ, అలసంద కలిపి విత్తితే, ఒరవడి అరికట్టబడటమే కాకుండా, అధిక నికరాదాయం పొందవచ్చు.

ఇక నల్ల నేలలకు నీటిని నిల్వ వుంచుకొనే శక్తి అధికం. వర్వప్తు నీరు త్వరగా ఇంకకపోవటం వల్ల ఎక్కువ శాతం నీరు, మట్టి కొట్టుకొని పోతుంది. ఈ నేలల్లో అధిక దిగుబడి సాధించడానికి భూసంరక్షణ, దున్నడంలో కొత్త సాంకేతిక పద్దతులను అవలంభించాలి. ఎర్రనేలలకు కాంటూరు గట్లు వేసే మాదిరిగా నల్ల నేలలకు 6.8 ఘనపు మీటర్ల గ్రేడెడ్‌ గట్లు వేయాలి. ఈ గట్ల పైభాగాన 6.1- 0.25. శాతం వాలుతో నీరు పోవడానికి కాలువ ఏర్పాటుచేసి, ఈ కాలువలను పెద్ద కాలవలతో కలిపి, నేల కోత లేకుండా, నీటిని బయటికి పోయేలా చేయాలి. వెదల్పాటి బోదెలు కాలువలుగా నేలను తయారుదేసి, వెదల్పాటి బోదెలపైన విత్తుకోవాలి. కాలువలు మురుగు నీటిని బయటికి పంపడానికి ఉపయోగపడతాయి.

READ ALSO : Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో.. కూరగాయలు అమ్ముతున్న యువజంట

లోతైన నల్లరేగడి నేలలకు ఈ పద్ధతి అనుకూలం. లేదంటే మూడు మీటర్ల వెడల్పుతో , 20 సెం.మీ ఎత్తుగల వెడల్పాటి బోదెలు చేసి విత్తుకొంటే మంచి దిగుబడులు వస్తాయి. బోదెల పక్కన కాలువలు తక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు ఇంకటానికి ఎక్కువ వర్షం వస్తే నీరు బయటకు పోవటానికి తోడ్పడతాయి. ఎకరానికి 8 టన్నుల పశువుల ఎరువు వేస్తే నీరు బాగా ఇంకుతుంది.