Herbicide Safety Tips : రైతులు పంటపొలాల్లో కలుపు మందులు వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కలుపు మందులు పిచికారి చేయుటకు ఉపయోగించే స్పేయర్లు సాధ్యమైనంత వరకు విడిగా ఉంచుకోవాలి. అలా వీలుకాని వక్షంలో ఈ మందులు చల్లిన వెంటనే ఏ మాత్రం అవశేషాలు లేకుందా మంచి నీటితో పలుమార్లు శుభ్రం చేయాలి.

Herbicide Safety Tips : రైతులు పంటపొలాల్లో కలుపు మందులు వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

herbicides in crops

Herbicide Safety Tips : పంటపొలాల్లో కలుపు నివారణకు ప్రస్తుతం మార్కెట్లోకి అనేక రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ మందులను ఎంతమోతాదులో వాడాలో, ఎలా వాడాలో పూర్తిస్ధాయి అవగాహన రైతులు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎట్టిపరిస్ధితుల్లో కలుపు నివారణ మందులను వాడరాదు. తెలియకుండా వాడటం వల్ల కొన్ని సార్లు కలుపు నివారణ మందుల వల్ల పంటకు నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది.

READ ALSO : Metta Crops Cultivation : మెట్టపైర్ల సాగులో పాటించాల్సి మెళుకువలు

మొండిజాతి మొక్కలైన తుంగ, గరిక, దర్భ మొదలగు కలుపు నిర్మూలనకు గ్లైఫోసెట్‌ వంటి మందులు ఆకుల దశలో పూత రాక ముందే పిచికారి చేసి రెండు. వారాల తర్వాత సేద్యం చేసుకోవాలి. మందు పిచికారి చేసిన తర్వాత 6-8 గంటల వ్యవధిలో వర్షం కురిస్తే మందు ప్రభావం తగ్గుతుంది. నీటిలో కరిగే పొడి రూవంలో ఉండే మందులను ఇసుకలో కలిపి వెదజల్లరాదు.

నిర్ధిష్టమైన నూచనలు లేనిచో కలువు మందులను, పురుగు, తెగుళ్ళ మందులతో కలుప రాదు. కాలపరిమితి దాటిన మందులను వాడకూడదు. సాధ్యమైనంత వరకు కలువు మందులను హాండ్ స్రేయర్‌తోనే పిచికారి చేయాలి. ప్రత్యేకించి పైరుపై పిచికారి చేసేటప్పుడు పవర్‌ ఫ్రేయర్‌ను వాడదలచి నప్పుడు నిపుణుల సలహా తీనుకోవాలి.

READ ALSO : Integrated Farming : పండ్లు, శ్రీగంధం, చేపల పెంపకంతో సమీకృత వ్యవసాయం

కలుపు మందులు పిచికారి చేయుటకు ఉపయోగించే స్పేయర్లు సాధ్యమైనంత వరకు విడిగా ఉంచుకోవాలి. అలా వీలుకాని వక్షంలో ఈ మందులు చల్లిన వెంటనే ఏ మాత్రం అవశేషాలు లేకుందా మంచి నీటితో పలుమార్లు శుభ్రం చేయాలి. కలుపు మందులను వాడే ముందు, మందుతో పాటు కంపెనీ వారిచ్చిన సమాచారాన్ని సూచనలను క్షుణ్ణంగా చదవాలి. పిచికారి చేయుటకు నరైన నాజిల్‌ను వాడాలి.

స్పేయర్ల నుండి మందు సమంగా వచ్చేటట్లు పిచికారి చేయాలి. ఒకసారి పిచికారి చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను మరలా పిచికారి చేయరాదు. అందువల్ల మందు మోతాదు ఎక్కువైతే పైరుకు నష్టం కల్గుతుంది. ‘ఒక ఎకరా విస్తీర్ణంలో కలువు మందు పిచికారి చేయడానికి 200లీ మందు నీరు అవసరమవుతుంది. మాగాణి వరిలో అయితే ఎకరానికి కావాల్సిన కలుపు మందును 20 కిలోల ఇసుకలో కలిపి పలుచగా నీరు పెట్టి పొలంలో వెదజల్లాలి. పొలంలో నీటిని బయటకు తీసి వేయకూడదు. 24-48 గంటల లోపల నీరు పెట్టాలి.

READ ALSO : Integrated Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న.. చార్టర్డ్ అకౌంటెంట్

ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే గాలి ఎక్కువగా వీస్తున్నపుడు కలుపు మందులు పిచికారి చేయరాదు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లోగాలి తక్కువగా ఉన్నప్పుడు విచికారి చేయడం మంచిది. అంతేగాక గాలికి ఎదురుగా విచికారి చేయరాదు.

కలుపు మందులు వెనుకకు నడుస్తూ పిచికారి చేయాలి. కలువు మందులు కూడ వురుగు మందుల వలె విషపూరితాలు, కనుక వీటిని ఆహార వదార్థాలు,పిల్లలకు దూరంగా ఉంచాలి. ఏదైన వ్రమాదం సంభవిస్తే వెంటనే డాక్టరును నంప్రదిందాలి.

READ ALSO : Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..

అహార పంటలపైన, పశువుల మేతకు వాడే పైర్ల మీద కలువు మందులు వాడినవుడు సూచించిన కాలపరిమితి తర్వాతనే పైర్లు కోయాలి. పంటను బట్టి, పంట దశను బట్టి పంటలో ఉండే కలుపును బట్టి కలుపు మందు వాదేరకం, వాడే సమయం, మోతాదు. కూడ మారుతుంది. కాబట్టి కలువు మందులు వాడదలచుకున్నప్పుడు నివుణుల సలహాలుగాని, సమీపంలోని వ్యవసాయాధికారిని గాని సంప్రదించటం మంచిది.