Natural Farming : జీవన ఎరువులు వాడుకునే విషయంలో రైతులు అనుసరించాల్సిన పద్ధతులు

ఈ పద్ధతి పంటను బట్టి, పంట కాలాన్ని బట్టి మారుతూ వుంటుంది. తక్కువ కాలవ్యవధి పంటలలో 1 నుంచి 15 కిలోల జీవన ఎరువును 40-60 కిలోల బాగా కుళ్ళిన వశువుల ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలానికి వాడుకొనవచ్చును.

Natural Farming : జీవన ఎరువులు వాడుకునే విషయంలో రైతులు అనుసరించాల్సిన పద్ధతులు

ORGANIC FARMING

Natural Farming : వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వాడకం వల్ల పెట్టుబడులు అధికం కావటంతోపాటుగా, పర్యావరణ కాలుష్యం అధికమౌతుంది. ఈ నేపధ్యంలో వ్యవసాయం రంగంలో సేంద్రియ ఎరువుల వాడకంతోపాటుగా జీవన ఎరువుల వాడకాన్ని రైతులు అనుసరిస్తున్నారు. మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించంలో జీవన ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి.

READ ALSO : Crop Damaging Birds : పంటకు నష్టం కలిగించే పక్షుల విషయంలో అనుసరించాల్సిన నియంత్రణా పద్ధతులు

జీవన ఎరువుల వల్ల భూమిలో సూక్ష్మజీవుల సంక్య అనుహ్యంగా పరిగి మొక్కలు వేగంగా పెరగటానికి అవసరమైన హార్మోన్లు, విటమిన్లు అందుతాయి. వీటి వల్ల రసాయన ఎరువుల వాడక మోతాదును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా జీవన ఎరువులను నాలుగు వద్ధతులలో ఉపయోగించవచ్చును. 1. విత్తనశుద్ధి 2. నారును ముందే పద్ధతి 3. నేల ద్వారా లేదా భూమిలో చల్లుట 4 డ్రిప్‌ వద్ధతిలో ఉపయోగించవచ్చు.

1. విత్తనశుద్ధి చేయుట :

ముఖ్యంగా వరి విత్తనాలు, గోధుమ జొన్న, మొక్కజొన్న మిరవ మరియు నూనెగింజల వంటలైన వేరుశనగ, కుసుమ, ప్రొద్దు తిరుగుడు, పప్పుదినుసు పంటలైన అలసంద. పెనర, మినుము, సోయావిక్కుడు మొదలైన పంటలలో జీవన ఎరువులను విత్తనశుద్ధి ద్వారా భూమిలో వేయవచ్చును 200 గ్రా, జీవన ఎరువు ప్యాకెట్‌ను 10 కిలోల విత్తనానికి విత్తనము యొక్క సైజును బట్టి మోతాదును నిర్ణయించుకోవచ్చు. విత్తనానికి పట్టించిన తరువాత ఒక గంట నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

READ ALSO : Herbicide Safety Tips : రైతులు పంటపొలాల్లో కలుపు మందులు వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అనుసరించాల్సిన పద్ధతి విషయానికి వస్తే ఒక ఎకరానికి సరిపడా విత్తనాన్ని తీనుకుని కుప్పగా చేసుకోవలి. ఒక ప్యాకెట్‌ జీవన ఎరువును (200 గ్ర.) బెల్లం ద్రావణం (100 మి.లీ. నీటిలో 10 గ్రా. బెల్లంతోకలిపి కాచి జిగురు వచ్చిన తరువాత వాడవలెను) లేదా గంజితో కలువవలెను. ఈ కలిపిన ద్రావకమును కుప్పగా వేసిన విత్తనాలపై చిలకరించవలెను. చిలకరించిన తరువాత బాగా. చేతులతో కలిపి విత్తనంపైన పొరలా ఏర్పడేలాగా చేయాలి.

2. నారును ముంచి వాడే పద్ధతి;

నారుమడి పంటలలో ఈ విధానాన్ని ముఖ్యంగా వరి, పాగాకు,టమోట, మిరవ, ఉల్లి, క్యాబేజి, క్యాలీఫ్లవర్‌ పంటలలో 1 ఒక కిలో జీవన ఎరువు ప్యాకెట్‌ను తీసుకుని 10 నుండి 15 లీటర్ల నీటితో బాగా కలుపుకోవలెను.

1;10 నిష్పత్తి ప్రకారం జీవన ఎరువల మిశ్రమం ప్యాకెట్ 10 లీటర్ల నీటిలో వేసుకోవాలి. కూరగాయ పంటలైన మిరప, టమోట, క్యాబేజి , క్యాలీఫ్లవర్ పంటలలో ఒక ప్యాకెట్ 0.1 హెక్టారుకు సరిపోతుంది.

READ ALSO : Tirumala : అక్టోబర్ 15 నుంచి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

3. నేల ద్వారా లేదా భూమిలో చల్లుట ద్వారా:

ఈ పద్ధతి పంటను బట్టి, పంట కాలాన్ని బట్టి మారుతూ వుంటుంది. తక్కువ కాలవ్యవధి పంటలలో 1 నుంచి 15 కిలోల జీవన ఎరువును 40-60 కిలోల బాగా కుళ్ళిన వశువుల ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలానికి వాడుకొనవచ్చును. ఎక్కువ కాల వ్యవధి ఉన్న పంటలలో 2-3 కిలోల ప్యాకెట్‌ జీవన ఎరువును 80-120 కిలోల ఎరువుతో కలివి ఒక ఎకరం పొలంలో వాడవచ్చు. ఈ మిశ్రమాన్ని విత్తుకునే సమయంలో లేదా పంట నాటిన తర్వాత నేలలో వేసి నీటి తడి ఇచ్చుకోవచ్చు. లేదా దుక్కిలో వేసుకోవచ్చు. లేదంటే పొలంలో చల్లుకోవచ్చు.

పండ్ల తోటలలో ఆకులు కత్తిరించిన చెట్లకు వేర్ల దగ్గర మట్టిని పాదులుగా చేసి జీవన ఎరువు మరియు కుళ్ళిన ఎరువుల మిశ్రమాన్ని వేనుకుని నీటిని పెట్టుకుంటే సరిపోతుంది.

READ ALSO : Heart Diseases : గుండె సంబంధిత వ్యాధులకు కారకాలు, నివారణ మార్గాలు !

4. డ్రిప్‌ పద్ధతిలో :

సుమారు 300 మి.లీ. నీటిలో 500గ్రాముల. జీవన ఎరువును తీసుకుని డ్రిప్‌ ట్యాంక్‌లో కలిపి మొక్కలు నాటీన వారం రోజులలో డ్రిప్‌ లైన్ల ద్వారా మొక్కలకు వేసుకోవాలి.