Central Bank of India Recruitment : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీ
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు 11ఫిబ్రవరి 2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

Various posts are filled in Central Bank of India
Central Bank of India Recruitment : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయి ప్రధానంగా పనిచేసే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచ్‌ల్లోని చీఫ్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
చీఫ్ మేనేజర్ స్కేల్-4 (మెయిన్ స్ట్రీమ్) 50, సీనియర్ మేనేజర్ స్కేల్-3 (మెయిన్ స్ట్రీమ్) 200 ఖాళీలు ఉన్నాయి. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. చీఫ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 40 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 35 ఏళ్లు మించరాదు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు 11ఫిబ్రవరి 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.centralbankofindia.co.in/en/recruitments పరిశీలించగలరు.