VCBL Recruitment : నిరుద్యోగులకు శుభవార్త.. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి నిజంగా ఇది శుభవార్త.

VCBL Recruitment
VCBL Recruitment : బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి నిజంగా ఇది శుభవార్త. విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ బ్రాంచీల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 30 పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చింది. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 28 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.1000 చెల్లించాల్సి ఉంది. 01-01-1991 నుంచి 31-12-2003 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి నగరాల్లో ప్రిమినరీ, మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.vcbl.in ను సందర్శించొచ్చు..
వివరాలు ఇవే..
సంస్థ.. విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్
పోస్టులు.. ప్రొబేషనరీ ఆఫీసర్
ఖాళీల సంఖ్య.. 30
పే స్కేల్.. నెలకు రూ.20,330 నుంచి రూ.45,590
అర్హత.. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి
వయోపరిమితి.. 31-12-2023 నాటికి 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. 01-01-1991 నుంచి 31-12-2003 మధ్య జన్మించిన వారు.
దరఖాస్తు విధానం.. ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు.. రూ.1,000.
ఎంపిక ప్రక్రియ.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా..
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ.. 01 జనవరి 2024
చివరి తేదీ.. 28 జనవరి 2024
ప్రిలిమినరీ పరీక్ష.. ఫిబ్రవరి 2024
పరీక్షా కేంద్రాలు.. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి
ఎన్ని మార్కులంటే..?
ఆన్‌లైన్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌ను 100 మార్కులకు, మెయిన్స్‌ను 250 మార్కులను నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అక్కడ ప్రతిభ కనబరిచిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.