Early Lok Sabha Polls: ముందస్తు లోక్‌సభ ఎన్నికలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికలపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని సీఎం నితీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.....

Early Lok Sabha Polls: ముందస్తు లోక్‌సభ ఎన్నికలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Bihar CM Nitish Kumar

Early Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికలపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని సీఎం నితీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.ప్రతిపక్షా ఐక్యతను పెంపొందించడానికి నితీష్ కుమార్(Bihar Chief Minister Nitish Kumar) చేసిన ప్రయత్నాలతో బీజేపీని వ్యతిరేకించే విపక్ష నాయకులు వచ్చే వారం పాట్నాలో సమావేశమై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించనున్నారు.ముఖ్యమంత్రి నివాసంలో ఆయన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్,ఇతరుల సమక్షంలో గ్రామీణ పనుల శాఖకు చెందిన రూ.6,680.67 కోట్ల విలువైన 5,061 ప్రాజెక్టులను ప్రారంభించారు.

Telangana Assembly polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సమీక్ష

2024 జనవరి నాటికి బీహార్ రాష్ట్రంలో పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. లోక్ సభ ఎన్నికలు వచ్చే ఏడాది కాకుండా ముందుగానే నిర్వహించే అవకాశాలున్నాయని నితీష్ కుమార్ జోస్యం చెప్పారు.(Early Lok Sabha Polls)మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం నిధులను 60 శాతానికి తగ్గించిందన్నారు.

Cyclone Biparjoy : నేడు తీరం దాటనున్న బిపర్‌జోయ్ తుపాన్..74వేల మంది తరలింపు

గ్రామీణ రహదారుల పథకాన్ని అటల్ బిహారి వాజ్ పేయి ప్రభుత్వం 2002వ సంవత్సరంలో ప్రారంభించి మొత్తం ఖర్చును కేంద్రమే భరించిందని నితీష్ కుమార్ చెప్పారు. కాని ప్రస్థుత మోదీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి 60 శాతం నిధులే ఇచ్చి మిగతా 40 శాతాన్ని రాష్ట్రాలు భరించాలని కోరుతుందన్నారు. దేశంలో ముందుస్తు లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశమున్నందున అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.