Karnataka Polls: ఎన్నికల్లో పోటీకి రౌడీ షీటర్‭ సాయం కోరిన పోలీస్.. కర్ణాటక ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం

బెంగళూరు సిటీ కమిషనర్‭గా పని చేసిన భాస్కర్ రావు ఉదంతం ఇది. నిన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో కర్ణాటక ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన.. ఈ మధ్యే భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే ఈయన పోటీ చేయనున్న చమరాజ్‭పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో అప్పటికే పాతుకు పోయి ఉన్న రౌడీ షీటర్ సునీల్ అలియాస్ సైలెంట్ సునీల్..

Karnataka Polls: ఎన్నికల్లో పోటీకి రౌడీ షీటర్‭ సాయం కోరిన పోలీస్.. కర్ణాటక ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం

Updated On : April 15, 2023 / 6:30 PM IST

Karnataka Polls: పోలీసులు అంటే చట్టవ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వ్యక్తులకు బద్ధవ్యతిరేకులు అనే మాట నానుడి అయిపోయింది. వాస్తవంలో ఇది ఎంత వరకు అమలు అవుతోందనేది పక్కన పెడితే.. అంతగర్గతంగా ఎలాంటి సంబంధాలు ఉన్నప్పటికీ, బయటికి మాత్రం ఆ మాటకు కట్టుబడి ఉన్నట్లుగానే కనిపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటారు. ఇది ఉద్యోగ జీవితం. కానీ రాజకీయం అలా కాదు. ఇక్కడ గోట్స్ బఫ్ఫెల్లోస్.. బఫ్ఫెల్లోస్ గోట్స్ అవుతుంటాయి. అచ్చంగా అలాగే జరిగింది. ఒక మాజీ సీనియర్ పోలీసు అధికారి రాజకీయ లాభం కోసం రౌడీ షీటర్ సాయం కోరారు.

Delhi Liquor Scam: తాను అవినీతిపరుడైతే లోకంలో నిజాయిపరులే ఉండరట.. కేజ్రీవాల్ చిత్రమైన వ్యాఖ్యలు

బెంగళూరు సిటీ కమిషనర్‭గా పని చేసిన భాస్కర్ రావు ఉదంతం ఇది. నిన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో కర్ణాటక ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన.. ఈ మధ్యే భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే ఈయన పోటీ చేయనున్న చమరాజ్‭పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో అప్పటికే పాతుకు పోయి ఉన్న రౌడీ షీటర్ సునీల్ అలియాస్ సైలెంట్ సునీల్ సైతం బీజేపీ టికెట్ ఆశించారు. అయితే ఈ ప్రయత్నాల్లో పార్టీ నుంచి భాస్కర్ రావులే టికెట్ లభించింది. కానీ ఆయనకు ప్రజలతో సంబంధాలు లేకపోవడంతో సునీల్ అవసరం ఏర్పడింది.

Karnataka Polls: అనుకున్నదే చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. మాజీ సీఎం సిద్దరామయ్యకు కోలార్ టికెట్ మిస్

రౌడీ షీటర్‭ను సాయం కోరేదేంటని ఆయన అనుకోవడం లేదు. తాను సునీల్ సాయం కోరుతానని చెబుతున్నారు. పైగా పోలీసింగ్, పాలిటిక్స్ రెండు వేరు వేరని కూడా అంటున్నారు. భాస్కర్ రావుకు టికెట్ రావడంపై సునీల్ మద్దతుదారులు తీవ్ర అసంతృప్తిలోనే ఉన్నారు. తమ అసంతృప్తిని పలు సందర్భాల్లో బహిరంగంగానే వెల్లడించారు. అయితే సునీల్‭ని కన్విన్స్ చేస్తే వారందరి నుంచి మద్దతు లభిస్తుందని, అది రాజకీయంగా ఉపయోగపడుతుందని భాస్కర్ రావు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం తనకు ఇంతకు మించి వేరే మార్గం లేదని కూడా స్వయంగా ఆయనే అంటున్నారు.

Karnataka Polls: కావాలనే ఆలస్యం చేసిన జేడీఎస్.. కాంగ్రెస్, బీజేపీ నేతలే టార్గెట్

నిజానికి బవసగుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భాస్కర్ రావు భావించారు. ఇక్కడ బ్రాహ్మణ జనాభా చాలా ఎక్కువ ఉంటుంది. భాస్కర్ రావు స్వయంగా బ్రాహ్మణుడు (మాధ్వా బ్రాహ్మణఉడు). ఆ టికెట్ కనుక దక్కితే తాను సునాయాసంగా విజయం సాధిస్తానని అనుకున్నారు. కానీ అధిష్టానం విచిత్రంగా అందుపు పూర్తి విరుద్ధమైన చమరాజ్‌పేట్‌ టికెట్ ఇచ్చింది. ఇక్కడ ముస్లిం జనాభాతో పాటు వెనుకబడిన జనాభా ఎక్కువగా ఉంటుంది. పైగా ఇక్కడ కాంగ్రెస్ నేత బి జెడ్ జమ్మర్ అహ్మద్ ఖాన్‭కు బలమైన కోట. 1994 నుంచి ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో, ఖాన్ 33,137 ఓట్ల తేడాతో గెలిచాడు, బిజెపి అభ్యర్థికి వచ్చిన మొత్తం ఓట్ల కంటే ఎక్కువ.