నటి రన్యారావు గోల్డ్ కేసు.. జాతీయ భద్రతకు ముప్పు? సంచలన విషయాలు వెల్లడించిన డీఆర్ఐ

ప్రముఖ కన్నడ నటి, పోలీసు ఉన్నతాధికారి కుమార్తె రన్యా రావు నాలుగు రోజుల క్రితం బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రూ.12.56 కోట్ల విలువైన బంగారాన్ని నడుముకు కట్టుకొని అక్రమంగా తరలిస్తున్నప్పుడు పట్టుబడింది. అయితే రన్యారావుకు సహాయం చేస్తోంది ఎవరని కోణంలో డీఆర్ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.