వినాయక చవితి సందర్భంగా ఇలా చేయండి.. 10టీవీ లక్కీడ్రాలో స్పెషల్ గిఫ్ట్‌ను సొంతం చేసుకోండి..
వీక్షకులకు 10టీవీ ఓ సువర్ణావకాశాన్ని అందిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ప్రతీయేటా భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిధి రోజున వినాయక చవితిని జరుపుకుంటారు. ఇక ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పట్టణాలు, పల్లెల్లో వాడవాడన గణనాథుడిని పూజించేందుకు మండపాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో వీక్షకులకు 10టీవీ ఓ సువర్ణావకాశాన్ని అందిస్తోంది.
మీ ఇంట్లో, మీ కాలనీలో, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రతిష్ఠించిన గణనాథుడితో దిగిన ఫొటోలను 10టీవీలో చూడాలనుకుంటున్నారా? లక్కీడ్రాలో స్పెషల్ గిఫ్ట్‌ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా? ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండోయ్..
మీరు ఏర్పాటు చేసిన గణనాథుడితో మీ సెల్ ఫోన్ లో సెల్ఫీ దిగి.. ఫొటోతో పాటు మీ పేరు, అడ్రస్‌ను 84980 33333కు నెంబర్‌కు వాట్సాఫ్ చేయండి చాలు. మీ కుటుంబ సభ్యులతో పాటు మీ ఫొటోను 10టీవీలో చూసుకోండి. అంతేకాదండోయ్.. మీరు పంపే సెల్పీ ఫొటోల నుంచి లక్కీడ్రాను నిర్వహించి స్పెషల్ గిఫ్ట్‌లను అందజేస్తాం. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వాట్సాఫ్ చేసేయండి.