9రోజుల్లో కరోనాను జయించిన 99ఏళ్ల బామ్మ : ఉక్కు పిండమే

  • Published By: nagamani ,Published On : June 29, 2020 / 02:03 PM IST
9రోజుల్లో కరోనాను జయించిన 99ఏళ్ల బామ్మ : ఉక్కు పిండమే

Updated On : June 29, 2020 / 2:24 PM IST

మనిషి విల్ పవర్ ఉంటే ఎంతటి భయంకరమైన రోగానైనా జయించవచ్చని ఎంతోమంది విషయంలో రుజువైంది. వ్యాధి వచ్చిందనీ భయపడిపోకుండా దాన్ని ఎదిరించే మానసిక స్థైర్యాన్ని మనిషి అలవరచుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుత కరోనా వైరస్ కాలంలో ప్రతీ మనిషి కావాల్సింది మానసిక స్థైర్యం. అది ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ..కరోనా మహమ్మారిని జయించవచ్చని ఇప్పటికే ఎంతోమంది వయస్సు పైబడినవారు సైతం నిరూపించారు.

సైలెంట్ గా..చాపకింద నీరులా మనుషులపై కరోనా వైరస్ దాడి చేస్తోంది. కనిపించకుండా దాడి చేసే కరోనా మహమ్మారిని కేవలం 9రోజుల్లో జయించింది 99 ఏళ్ల మహిళ నిరూపించారు. డాక్టర్లను సైతం ఆశ్చర్యానికి గరిచేసిన ఈ ఘటన బెంగుళూరులో జరిగింది.సాధారణంగా కరోనా వృద్ధులకు వస్తే వారు బ్రతకటం కష్టమని నిపుణులు చెబుతున్న మాట. కానీ ఎంతోమంది వృద్ధులు కరోనాను జయించారనే వార్తలు విన్నాం. అటువంటిదే కరోనా మహమ్మారిని జయించిన బెంగుళూరు బామ్మగారి విజయం.

సదరు బామ్మగారికి మనవడి ద్వారా కరోనా బారినపడ్డారు. వారిద్దరు జూన్ 18న నగరంలోని విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ డాక్టర్లత సహా బంధువులు కూడా బామ్మ మీద ఆశలు వదులుకున్నారు. మనవడు వయసులో ఉన్నాడు..ఇమ్యూనిటీ పవర్ బాగా ఉన్నవాడు కాబట్టి అతను కరోనా నుంచి కోలుకుంటాడని..బామ్మగారి పరిస్థితి మాత్రం కష్టమేననుకున్నారు. కానీ అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తూ 99ఏళ్ల బామ్మ కరోనా నుంచి కోలుకున్నారు.

మనవడితో సహా కోలుకుని షాక్ ఇచ్చారు. కేవలం 9 రోజుల్లోనే తన మనవడితో పాటు ఆమె కూడా కోలుకుని ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరోవైపు కరోనా వైరస్ సోకి అదే ఆసుపత్రిలో చేరిన బామ్మ కొడుకు, కోడలు కూడా చికిత్స పొందుతున్నారు.కానీ కరోనా వచ్చిన తరువాత ఆ బామ్మ చికిత్సకు ఒప్పుకోలేదు. ఆమెకు డాక్టర్లతో కుటుంబ సభ్యులు నచ్చజెప్పి చికిత్స అందించామని విక్టోరియా ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.

బామ్మగారితో మాట్లాడిన తరువాత ఆమె ప్రతీ విషయం చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. కుటుంబం గురించి ఆమె పడేతపన అంతా ఇంతా కాదు..అలా ఆలోచించే ఆమె పాజిటివ్‌ దృక్పథమే కరోనా నుంచి త్వరగా కోలుకునేలా చేసిందని డాక్టర్లు అంటున్నారు.

‘మార్కెట్‌ వెళ్లి ఇంట్లోకి సరుకులు తీసుకొచ్చే నా కొడుకు(29)తోనే కరోనా వ్యాప్తి జరగొచ్చని అనుకుంటున్నాం. కరోనా నుంచి నా కొడుకుతోపాటు వయసులో పెద్దవారైన మా అమ్మగారు కోలుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్నారు ఆమె కొడుకు. మా ముగ్గురికీ లక్షణాలు బయపడ్డాయి కానీ..మా అమ్మగారికి మాత్రం ఏమాత్రం లక్షణాలు కనబడలేదు. కానీ ఎందుకైనా మంచిదని ఆమెకు కూడా కరోనా టెస్ట్ లు చేయించటంతో పాజిటివ్ వచ్చింది. దాంతో మేం చాలా ఆశ్చర్యపోయాం. ఎటువంటి లక్షణాలు లేకుండా కరోనా దాడి చేస్తుందని తెలుసుకుని ఆశ్చర్యపోయాం. కానీ 99ఏళ్ల మా అమ్మకూడా కోలుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందని కొడుకు..మనుమడు కోడలు సంతోషం వ్యక్తంచేశారు.

కాగా, కర్ణాటకలో కరోనా నుంచి కోలుకున్న అత్యంత వృద్ధురాలిగా ఆమె రికార్డు నెలకొల్పారు. ఆమె 99వ పుట్టినరోజు నాడే ఆమె ఆసుపత్రిలో చేరడం విశేషం. అంతేకాదు ఆమె కరోనా మహమ్మారినుంచి కోలుకోవటం అంతకంటే పెద్ద విశేషం.

Read:ముఖానికి ప్లాస్టిక్ ‘ఫేస్ షీల్డ్’ ధరించడం మంచిదేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?