Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలో భారీ జాబ్ మేళా.. రూ.18 వేల జీతం.. ఇలా అప్లై చేసుకోండి
Job Mela: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్. నంద్యాల జాల్లాలోని పీఎస్సీ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు.

Job fair in Nandyal on July 8th
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్. నంద్యాల జాల్లాలోని పీఎస్సీ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. జులై 8 మంగళవారం రోజున జరుగనున్న ఈ జాబ్ మేళాలో రెండు ప్రముఖ కంపెనీలు పాల్గొనన్నున్నాయి. మొత్తం 50 ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని అధికారులు సూచించారు.
ఉద్యోగ వివరాలు:
- ఫ్యూషన్ మైక్రో ఫైనాన్స్ కంపెనీలో 30 రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల భర్తీ చేయనున్నారు.
- పే టీఎం కంపెనీలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ 20 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
విద్యార్హత:
- రిలేషన్షిప్ మేనేజర్ జాబ్స్ కోసం అప్లై చేసుకునేవారు ఇంటర్ / డిగ్రీ చదువు పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టు కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు టెన్త్/ఇంటర్ చదువు ఉత్తీర్ణత సాదించాలి.
వయోపరిమితి:
- రిలేషన్షిప్ మేనేజర్ జాబ్స్ కోసం అప్లై చేసుకునేవారి వయసు 18 నుంచి 32 ఏళ్ళ మధ్యలో ఉండాలి
- ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కోసం అప్లై చేసుకునేవారి వయసు కూడా 18 నుంచి 32 ఏళ్ళ మధ్యలో ఉండాలి
వేతన వివరాలు:
- రిలేషన్షిప్ మేనేజర్ జాబ్స్ కి ఎంపికైన వారికి నెలకు రూ.15,000 జీతం ఇస్తారు.
- ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కి ఎంపికైన వారికి నెలకు రూ.18,000 జీతం ఇస్తారు.