Figs: ఉదయం నానబెట్టిన అంజీర్ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి.. జాగ్రత్తలు తప్పనిసరి

అంజీర్ లేదా అత్తి పండు. ఇది ఒక పోషకవంతమైన పండు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది(Figs) ఆరోగ్యం కోసం తింటున్న డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి.

Figs: ఉదయం నానబెట్టిన అంజీర్ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి.. జాగ్రత్తలు తప్పనిసరి

Health benefits of eating soaked figs every day

Updated On : September 1, 2025 / 3:59 PM IST

Figs: అంజీర్ లేదా అత్తి పండు. ఇది ఒక పోషకవంతమైన పండు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆరోగ్యం కోసం తింటున్న డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి. అంతేకాదు, ఆయుర్వేదం, యూనానీ వైద్యాలలో ఎంతో ప్రాముఖ్యత దీనికి ఉంది. చాలా మంది నిపుణులు సైతం ఈ పండును(Figs) తినమని సూచిస్తున్నారు. అంతలా ఆరోగ్యంలో భాగంగా మారిపోయింది అంజీర్ పండు. అయినప్పటికి, చాలా మందికి ఈ పండు గురించి, అది అందించే ప్రయోజనాల గురించి తెలియదు. ఇక్కడ ఆ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Hair Health: ఈ చిన్న చిట్కా పాటించండి.. తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది.. ఎలాంటి కెమికల్స్ లేకుండా

నానబెట్టిన అంజీర్‌లో ఉండే ముఖ్యమైన పోషకాలు:

  • డైటరీ ఫైబర్
  • విటమిన్ A, B1, B2
  • కాల్షియం
  • మెగ్నీషియం
  • ఐరన్
  • పొటాషియం
  • యాంటీఆక్సిడెంట్లు
  • ప్రాకృతిక చక్కెరలు

అంజీర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1.జీర్ణక్రియ మెరుగవుతుంది:
అంజీర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం ఉన్నవారికి ఇది సహజమైన నివారణ మార్గంగా ఈ పండును చెప్పుకోవచ్చు.

2.హృదయ ఆరోగ్యాన్ని పెంచుతుంది:
అంజీర్ లో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె ధమనుల్లో కొవ్వు పెరగకుండా నిరోధిస్తాయి.

3.షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది:
అంజీర్‌లో సహజ చక్కెరలు ఉన్నా అవి బ్లడ్ గ్లూకోజ్ స్థాయిని నియంత్రించగలవు. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఇది మధుమేహ నియంత్రణలో అద్భుతంగా తోడ్పడుతుంది.

4.ఎముకల ఆరోగ్యానికి బలాన్నిస్తుంది:
అంజీర్ లో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. రోజూ 2 నుంచి 3 నానబెట్టిన అంజీర్లు తినడం వల్ల ఎముకల బలం పెరుగుతుంది.

5.రక్తహీనత (అనేమియా) నివారణ:
అంజీర్‌లో ఉండే సహజ ఐరన్ శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ముఖ్యంగా మహిళలకి ఇది ఉపయోగకరంగా చెప్పుకోవచ్చు.

6. మెదడు ఆరోగ్యానికి మేలు:
అంజీర్ లో ఉండే బి-కాంప్లెక్స్ విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఉదయం నానబెట్టి తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరిగి, ఒత్తిడి తగ్గుతుంది.

జాగ్రత్తలు:

  • మితంగా మాత్రమే తీసుకోవాలి
  • రోజుకి 2 నుంచి 3 పండ్లు తినడం మంచిది
  • అధికంగా తీసుకుంటే విరేచనాల సమస్య రావచ్చు
  • షుగర్ ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి
  • అలెర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండటం మంచిది