Brain Stroke Symptoms : మీ చేతిలో బలహీనతగా అనిపిస్తుందా? కదిలించలేకపోతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభ సంకేతాలివే..!

Brain Stroke Symptoms : ఉన్నంట్టుండి మీ చేతిలో కదలికను కోల్పోయారా? చాలా బలహీనంగా అనిపిస్తుందా? అయితే, అది బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభ లక్షణం కావొచ్చు.. తస్మాత్ జాగ్రత్త.. వెంటనే వైద్యసాయం అత్యవసరం..

Brain Stroke Symptoms : మీ చేతిలో బలహీనతగా అనిపిస్తుందా? కదిలించలేకపోతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభ సంకేతాలివే..!

Brain Stroke _ Weakness In The Arm And Other Early Signs Of A Stroke

Brain Stroke Symptoms : మీ చేతిలో ఆకస్మాత్తుగా బలహీనతగా అనిపిస్తుందా? చేతిలో కదిలికను కోల్పోయారా? స్పర్శ కూడా తెలియడం లేదా? అయితే, అది బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభ లక్షణం కావొచ్చు. ఎందుకంటే.. సాధారణంగా సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ (CVA) స్ట్రోక్ అని పిలుస్తారు. మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు లేదా మెదడు కణజాలం ఆక్సిజన్ అందక పోషకాలను కోల్పోయినప్పుడు సంభవిస్తుంది.

మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో అడ్డుపడటం వల్ల (ఇస్కీమిక్ స్ట్రోక్) లేదా మెదడులోని రక్తనాళాల చీలిక (హెమరేజిక్ స్ట్రోక్) వల్ల ఈ స్ట్రోక్ వస్తుంది. మెదడు కణాలు ఆక్సిజన్ అందనప్పుడు త్వరగా దెబ్బతింటాయి లేదా చనిపోతాయి. వివిధ నాడీ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. స్ట్రోక్ సమయంలో అనుభవించే నిర్దిష్ట లక్షణాలు మెదడు దెబ్బతిన్న ప్రదేశం, పరిధిపై ఆధారపడి ఉంటాయి.

Read Also : Hyderabad Hospital : హైదరాబాద్ వైద్యుల అరుదైన ఘనత.. 60ఏళ్ల వ్యక్తి కిడ్నీలో 418 రాళ్లను తొలగించారు..!

సాధారణంగా చేతిలో బలహీనత అనేది స్ట్రోక్ సాధారణ లక్షణమని చెప్పవచ్చు. ప్రత్యేకించి స్ట్రోక్ చేతుల్లో కదలికను నియంత్రించే మెదడులోని భాగాన్ని ప్రభావితం చేస్తుంది. చేతిలో బలహీనత సాధారణంగా శరీరానికి ఒక వైపున సంభవిస్తుంది. అది తేలికపాటి నుంచి తీవ్రమైనదిగా ఉంటుంది. ప్రభావితమైన చేతిలో తిమ్మిరి, జలదరింపు లేదా సమన్వయం కోల్పోవడం వంటి వాటితో కూడి ఉండవచ్చు. స్ట్రోక్ సమయంలో సాధారణంగా అనుభవించే ఇతర లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రోక్ ఇతర ప్రారంభ సంకేతాలు ఇవే :
1. ఆకస్మిక బలహీనత లేదా తిమ్మిరి :
ముఖం, చేయి లేదా కాలుకు ఒక వైపున సంభవించవచ్చు. అకస్మాత్తుగా శరీరంలో ఒక వైపు కదలకపోవడం వంటి ఇబ్బందిని గమనించవచ్చు.

2. మాట్లాడడంలో తడబాటు :
మాట్లాడటంలో తడబాటు లేదా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం, అస్పష్టమైన మాట లేదా సరైన పదాలను గుర్తించడంలో ఇబ్బంది వంటివి స్ట్రోక్‌ను సూచిస్తాయి.

3. నడకలో ఇబ్బంది :
ఆకస్మిక మైకం, సమన్వయం కోల్పోవడం, నేరుగా నడవడం కష్టంగా అనిపించడం అనేది స్ట్రోక్ సంకేతాలు కావచ్చు.

4. తీవ్రమైన తలనొప్పి :
కారణం లేకుండా అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఇది స్ట్రోక్‌కు సంకేతంగా చెప్పవచ్చు. ప్రత్యేకించి ఇతర లక్షణాలతో కూడి ఉన్నప్పుడు కచ్చితంగా జాగ్రత్త పడాలి.

5. కంటిచూపు మసకబారడం :
కంటి దృష్టి అస్పష్టంగా మారడం లేదా రెండుగా ప్రతిబింబం కనిపించడం, ఒకటి లేదా రెండు కళ్లలో అకస్మాత్తుగా దృష్టి కోల్పోవడం లేదా ఒకటి లేదా రెండు కళ్లను చూడడంలో ఇబ్బంది ఉండటం వంటి లక్షణాలు స్ట్రోక్ సమయంలో సంభవించవచ్చు.

6. ముఖం పక్కకు వంగిపోవడం :
ముఖంలోని ఒక భాగం ఒక వైపు వంగిపోతుంది లేదా మొద్దుబారి తిమ్మిరిగా ఉంటుంది. ముఖ్యంగా నవ్వడానికి ప్రయత్నించిన సమయంలో స్వర్శ తెలియకపోవడం వంటివి గమనించవచ్చు.

7. మింగడం కష్టం :
ఆకస్మికంగా నోరు, గొంతు కండరాల్లో బలహీనత కారణంగా మింగడం లేదా నియంత్రించడంలో కష్టంగా అనిపించడం బ్రెయిన్ స్ట్రోక్‌ను సూచిస్తుంది.

8. సమన్వయం కోల్పోవడం :
ఆకస్మికంగా సమన్వయం కోల్పోవడం, నేరుగా నడవడం లేదా నిలబడటం కష్టంగా ఉండటం అనేది కూడా స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు.

9. ఆకస్మికంగా తీవ్రమైన వెర్టిగో రావడం :
అకస్మాత్తుగా, తీవ్రమైన తల తిరగడం అనిపించడం, ప్రత్యేకించి ఇతర స్ట్రోక్ లక్షణాలతో పాటు బ్రెయిన్ స్ట్రోక్‌ను సూచిస్తుంది.

మీరు లేదా మరెవరైనా ఆకస్మికంగా బలహీనత లేదా చేతి తిమ్మిరిని అనుభవిస్తే.. ప్రత్యేకించి ఇతర స్ట్రోక్ లక్షణాలతో పాటు శరీరం ఒక వైపున సంభవిస్తే.. తక్షణ వైద్య సాయం తీసుకోవడం అత్యంత అవసరం. స్ట్రోక్‌ల చికిత్స విషయానికి వస్తే.. సమయం చాలా కీలకం. లక్షణాలు సంభవించిన సమయం నుంచి రెండు గంటల్లోపు ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకుంటే తొందరగా కోలుకోవచ్చు. సమయం మించిన తర్వాత వెళ్తే చికిత్స చేసిన ఫలితం ఉండదు. పైగా దీర్ఘకాలిక వైకల్యంతో బాధపడాల్సి వస్తుంది.

Read Also : Nurse Weight Loss Tricks : బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఈ సింపుల్ డైట్ ట్రిక్స్‌తో 45కిలోలు తగ్గిన నర్సు..!