బ్రెజిల్, సౌతాఫ్రికా, యూకే కొత్త వేరియంట్లు ఏంటి? అసలు కరోనా వ్యాక్సిన్లు పనిచేస్తాయా?

Covid-19 Vaccines : ప్రపంచమంతా కరోనా కొత్త వేరియంట్లు పుట్టకొస్తున్నాయి. బ్రెజిల్‌లో మొట్టమొదటిసారిగా గుర్తించిన కోవిడ్ వేరియంట్ యూకేలో బయటపడింది. ప్రభుత్వ ఆరోగ్య అధికారులు ఈ వేరియంట్ కు సంబంధించి ఆరు కేసులను పరీక్షిస్తున్నారు. ఇంకా ఎంతమందికి వైరస్ సోకిందో టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. కొన్ని వేరియంట్లు కూడా ఈ యూకే వేరియంట్ మాదిరిగానే వేగంగా వ్యాపించగలదు. ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు అంత సమర్థవంతంగా పనిచేయవని నిపుణులు భావిస్తున్నారు.
కొత్త వేరియంట్లు ఏంటి? :
ఇంతకీ ఈ కొత్త వేరియంట్లు ఏంటి? ఎన్ని ఉన్నాయంటే.. వేల సంఖ్యలో కోవిడ్ సంబంధించి వేర్వేరు వేరియంట్లు ఉన్నాయి. యూకే లేదా కెంట్ వేరియంట్ (B.1.1.7) అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్ నుంచి 50 దేశాలకు పైగా ఈ వేరియంట్ వ్యాపించింది. ఇంకా మ్యుటేట్ అవుతూనే ఉంది. మరో వేరియంట్.. సౌతాఫ్రికా వేరియంట్.. (B.1.351) యూకే సహా కనీసం 20 ఇతర దేశాల్లోనూ ఈ వేరియంట్ వ్యాపిస్తోంది. బ్రెజిల్ వేరియంట్ (P1) జపాన్ వెళ్లిన నలుగురిలో ఈ వైరస్ కనిపించింది. ఆ తర్వాత యూకేలో ఈ వైరస్ వ్యాపించింది.
కొత్త వేరియంట్లు ప్రాణాంతకమా? :
ఏయే కరోనా వేరియంట్ ప్రాణాంతకమో కచ్చితమైన ఆధారాలేమి లేవు. ఒరిజినల్ కరోనా వైరస్ తో మాత్రం అత్యధికంగా ఎక్కువమందికి ముప్పు ఉందని గుర్తించారు. అందులో వృద్ధులతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిలో ప్రాణాంతకమని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. యూకే వేరియంట్ కారణంగా 30శాతం అత్యధికంగా మరణ ముప్పు ఉందని తేలింది. దీని ఆధారాలు అంత బలంగా లేవు. డేటాపై ఇంకా అనిశ్చితి నెలకొంది. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరాన్ని పాటించడం, మాస్క్ ధరించడం వంటి చర్యలతో వైరస్ సోకకుండా నియంత్రించవచ్చు.
వైరస్ ఎలా మ్యుటేట్ అవుతుంది :
యూకే, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వైరస్ ను వ్యాపించగలవు. ఈ మూడు కొత్త వేరియంట్లు తమ స్పైక్ ప్రోటీన్ ను మార్చేసుకున్నాయి. హ్యుమన్ సెల్స్ కు అటాచ్ చేసే ఈ స్పైక్ ప్రోటీన్ ఎప్పటికప్పుడూ కొత్త రూపును మార్చుకుంటున్నాయి. ఈ మ్యుటేషన్ ను E484K అని పిలుస్తారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసేందుకు అన్ని భాగాలకు వ్యాపింపచేస్తుంది. వ్యాక్సిన్ లేదా ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత తయారయ్యే యాంటీబాడీలు కరోనావైరస్ పై పోరాడతాయి. ఈ మ్యుటేషన్ల కారణంగా అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతాయి. కొన్ని మ్యుటేషన్లు కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చేలా చేస్తాయి. ఈ మూడు కొత్త వేరియంట్లు అత్యంత సులభంగా ఒకరినుంచి మరోకరికి వేగంగా వ్యాపించగలవు.
వ్యాక్సిన్లు పనిచేస్తాయా? :
ప్రారంభ కరోనా వ్యాక్సిన్లపై పనిచేసేలా ప్రస్తుత వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారు. కానీ, సైంటిస్టులు మాత్రం ఈ కొత్త వేరియంట్లపై కూడా పనిచేస్తాయని నమ్ముతున్నారు. ప్రభావంతంగా పనిచేస్తాయనడంలో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. బ్రెజిల్ వేరియంట్ యాంటీబాడీలను అణిచివేస్తోందని కొత్త అధ్యయనంలో తేలింది. ఫైజర్ వ్యాక్సిన్ కొత్త వేరియంట్ల నుంచి రక్షించగలదని ల్యాబరేటరీ ఫలితాల్లో తేలింది. కానీ, పూర్తి స్థాయిలో కాదని డేటా పేర్కొంది. ఇక నోవాక్స్, జాన్సెన్ అనే రెండు కొత్త కరోనా వ్యాక్సిన్లు కొంతవరకు రక్షణ ఇవ్వగలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. సౌతాఫ్రికా వేరియంట్ పై మోడ్రెనా కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఇటీవల అధ్యయన ఫలితాల్లో వెల్లడైంది. ఈ వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధకత బలంగా లేదా దీర్ఘకాలికంగా ఉంటుందని కచ్చితంగా చెప్పలేమంటున్నారు సైంటిస్టులు.