ప్రపంచం కోసం చైనా తన రాష్ట్రాన్ని బలిచేసిందా?

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 11:53 AM IST
ప్రపంచం కోసం చైనా తన రాష్ట్రాన్ని బలిచేసిందా?

Updated On : February 6, 2020 / 11:53 AM IST

వూహాన్, హుబాయ్ రాష్ట్రానికి రాజధాని. కరొనా వైరస్ టెస్ట్ ల కోసం హాస్పిటల్స్ దగ్గర క్యూలో కనిపిస్తున్నారు. కొందరికి జ్వరం వచ్చింది. నిల్చోలేకపోతున్నారు. తమ ఆత్మీయులు కరోనా వల్ల చనిపోతే…వాళ్లను చూసేందుకు కూడా చైనా ఒప్పుకోవడంలేదు. డాక్టర్లు రాత్రీ పగలు పనిచేస్తున్నారు.

corona

కొందరు డాక్టర్లు రోజుకు రెండుగంటలు కూడా నిద్రపోవడంలేదు. అందర్నీ టెస్ట్ చేయాలి. నెగిటీవ్ వచ్చేంతవరకు వాళ్లను పరీక్షించాల్సిందే. కరొనా టెస్ట్ చేయించుకోవడానికి ఒక్కొక్కరికి ఎనిమిది గంటలుపడుతోంది. ఇది జాతీయ సమస్య.

china

అలజడులు, నిరాశలు చైనాలోని హుబాయ్  రాష్ట్రంలో రోజూ కనిపిస్తున్నాయి. తీరం లేదు. జనాభా ఆరుకోట్లు. ఇక్కడే కరొన వైరస్ పుట్టింది. 2019nCoV అని పెట్టారు. డిసెంబర్ లో మొదట జాడ కనిపించింది. సార్స్ లా ఉన్న వైరస్ అని అనుకున్నారు. ఏడువారాలు తిరిగేసరికి… 20దేశాల్లో కనిపించింది. ప్రపంచాన్ని భయపెడుతోంది.కాని, మొత్తం కరోనా మరణాల్లో 97 శాతం, మొత్తం రోగుల్లో 67 శాతం ఇక్కడే, హుబాయ్ లోనే.

రాష్ట్రమే బందీఖానా!
మరణాల సంఖ్య తగ్గుతున్నట్లే ఉంటోంది. అంతలోనే ఒక్కసారిగా వందల మందిరోగులు హాస్పటిల్స్ కు వస్తున్నారు. ఇంకా పూర్తిగా అంతుచిక్కని వైరస్ ధాటిని తట్టుకోవడం స్థానిక వైద్యుల తరం కావడంలేదు. ఏ రోగం వచ్చినా ముందు కరొనా టెస్ట్ చేయడమంటేనే సమస్య మరింత ముదురుతోంది. ఇక్కడి నుంచి వైరస్ మిగిలిన ప్రాంతాలకు వ్యాప్తిచెందకూడదని మొత్తం రాష్ట్రాన్నే దిగ్భందించేసింది. ఈ రాష్ట్రమే ఒక quarantine zone. ఎంతకష్టమొచ్చినా సరే ఒక్కరినీ రాష్ట్రం దాటడానికి వీళ్లేదు. డాక్టర్లతో సహా ఒక్కరినీ బైటకు వదలట్లేదు.

man

హుబాయ్ రాష్ట్రానికి కేపిటల్ వుహాన్. ఇక్కడ కార్లఫ్యాక్టరీలు, మెడికల్ కాలేజీలు ఎక్కువ. భారతీయులే కనీసం 20వేల మంది వుహాన్ లో మెడిసిన్ చదువుకొంటున్నారు. అలాంటి రాష్ట్రాన్ని నిర్బంధించిడంతో కరొనా వైరస్ ను తాను భరిస్తూ మిగిలిన ప్రాంతాలను రక్షిస్తోంది. అందుకే మిగిలిన ప్రాంతాల్లో వైరస్ రోగుల్లో మరణాలు 0.16 శాతమైతే, వూహాన్ లోమాత్రం 3.1శాతం.

హుబాయ్ ను సీల్ చేయకపోతే? 
 ఇక్కడి జనం వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు వైరస్ మరింత తీవ్రంగా వ్యాపించేది. చైనాయే బలైయ్యేది. ఒకవేళ వూహాన్ నుంచి ప్రతిరోజూ సింగపూర్, హాంగ్ కాంగ్, అమెరికాకు వెళ్లే విమానాలు వైరస్ ను తీసుకెళ్లేవి. అప్పుడు కరొనా మహమ్మారిలా మొత్తం ప్రపంచాన్నే కమ్మేసేది.

hubei

వూహాన్ గొప్ప సిటీకాదు. సెకండ్ టైర్ సిటీ. షాంగైలా ఎదగడానికి కలలుగంటున్న నగరం. మెడికల్ కాలేజీలు ఎక్కువకాబట్టి వైద్యసౌకర్యాలకు లోటులేదు. అలాగని అంతర్జాతీయ స్థాయి హాస్పటల్స్ తక్కువ. అలాంటి నగరంలో డిసెంబర్ లో వైరస్ కనిపించింది. ఈ సంగతి డాక్టర్లు తమ గ్రూప్స్ లో పోస్ట్ చేశారు. వైద్య అధికారులు మాత్రం పరువుకోసం ఈ సంగతిని దాచారు. చైనా నెత్తిమీదకు తెచ్చారు.

Read Also : ఆ 7 వారాల్లో చైనాలో ఏం జరిగింది?

bed

జనవరి 23న వైరస్ గురించి ప్రకటించేసమయానికి వూహాన్ నగరంలో ఉన్న ఇంటెన్సీకేర్ బెడ్స్ 110. అప్పటికే అవన్నీ వైురస్ బాధితులతో నిండిపోయాయి. ఒకటి ఖాళీ ఐతేకాని…మరొకరికి చోటులేదు. కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతుంటే వూహాన్ ను అదునుచూసి వైరస్ దెబ్బతీసింది. Resident evil సినిమా చూపించింది.

construction

కరొనాను బాధితులను కోసం 8000మంది వైద్యసిబ్బంది  హుబాయ్ కెళ్లారు. 27హాస్పిటల్స్ ను కరొనా వైద్య శిబిరాలుగా మార్చారు. అవన్నీ సరిపోలేదు. అందుకే వెయ్యిపడకల హాస్పటిల్స్ ను పదిరోజుల్లో కట్టారు. రెండువారాల్లోనే 2,600 కొత్త బెడ్స్ ను అందుబాటులోకి తెచ్చినా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. పరిస్థితి కాస్త మెరుగైనా, వైద్య పరికరాలు, మందులు, ఇతరత్రా సామాగ్రి కొరతుంది. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొనే బలగం చైనాకున్నా, కరొనా వైరస్ మాత్రం ఊహించని శత్రువు.

Read Also : కరోనాను మొదట కనుగొన్న డాక్టర్.. ఆ వైరస్‌కే బలైపోయాడు!