కరోనా వైరస్ గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో అప్పుడే చెప్పారా ?

  • Publish Date - January 28, 2020 / 01:52 PM IST

కరోనా వైరస్…… ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికించేస్తోంది. ఇప్పుడు ఈ corona virus ఇండియాలో కొందరికి వచ్చినట్లు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. పూర్తిగా ఎవరికీ ఈవ్యాధి సోకిన దాఖలాలులేవు. చైనా, సింగపూర్, థాయ్ లాండ్ ల నుంచి భారత్ వచ్చిన కొందరు ప్రయాణికులు ముందు జాగ్రత్త చర్యగా corona virus  పరీక్షలు చేయించుకుంటున్నారు.  ఇప్పుడు లేటెస్ట్ గా ఈ విషయాన్ని బ్రహ్మం గారు తన  కాలజ్ఞానంలో 114 వ పద్యంలో చెప్పారంటూ  ఇదివరకెప్పుడో ప్రింట్ అయిన ఇమేజ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : సైంటిస్టులు కనిపెట్టేశారు: #Coronavirus వెనుక షాకింగ్ రీజన్స్!

ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను
లక్షలాది  ప్రజలు సచ్చేరయ
కోరంకియను జబ్బుకోటిమందికి తగిలి
కోడిలాగ తూగిసచ్చేరయ  !!శివ!!   114

అనే పద్యం వైరల్ అవుతోంది. అప్పట్లో బ్రహ్మంగారు చెప్పిన కోరంకి…ఇప్పుడు చైనా కరోనా వైరస్ ఒకటే అయితే, పెద్ద ప్రమాదమే ముంచుకొస్తోందని కొందరు భయపెడుతున్నారు. ఎందుకంటే  పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిన భవిష్యత్ ఫలితాలు కొంచెం అటు ఇటుగా జరిగిన దాఖలాలు చాలానే ఉన్నాయి. 

భారత్ కు ఈశాన్య దిక్కున అని కాలజ్ఞాన పద్యంలో ఉదహరించారు. ఇప్పుడ చైనా కూడా భారత్ కు ఇంచుమించు ఈశాన్య దిక్కులోనే ఉంటుంది. కాబట్టి  బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన కోరంకి అనే జబ్బు ఇప్పటి కరోనా వైరస్ రెండూ ఒకటే అయి ఉంటాయనే  వ్యాఖ్యలతో  ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయినా  భారత్ ప్రభుత్వం వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. 

2020,జనవరి28, నాటికి చైనాలో కరోనా వైరస్  వ్యాధి భారిన పడి మరణించిన వారి సంఖ్య 106 కి చేరగా వ్యాధి లక్షణాలతో 1300 కేసులు నమోదు అయినట్లు సమాచారం. కరోనా వైరస్ వ్యాధి బారిన  పడిన వారు ఎక్కడికక్కడ కుప్పకూలుతున్నట్లు కొన్నివీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  మాస్కులు ధరించిన వైద్య సిబ్బంది వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు అందులో ఉంది. కాకపోతే అలా పడిపోతున్న వారు కరోనా వైరస్ బాధితులా కాదా  అనే అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
Also Read : పూర్తి Visual Guide మీకోసం: ‘కరోనా’ వ్యాప్తికి అసలు కారణాలు ఇవే!

మరోవైపు కరోనా వైరస్ హైదరాబాద్ లో  వ్యాప్తి చెందిందని… వైరస్ బారిన పడిన వందలాది మంది  గాంధీ ఆస్పత్రిలో చేరుతున్నారనే పోస్టు ఒకటి  వాట్సప్ గ్రూపుల్లోనూ వైరల్ అయ్యింది.  కరోనా కేసులు రాష్ట్రంలో ఎక్కడా నమోదుకానప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. అనుమానితులకు వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.

హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. చైనా తదితర కరోనా పీడిత దేశాల నుంచి హైదరాబాద్‌ వస్తున్నవారికి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఢిల్లీకి చెందిన సెంట్రల్‌ మెడికల్‌ అథారిటీ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎవరికైనా వైరస్‌ లక్షణాలున్నట్టు అనుమానం వస్తే, వెంటనే వారిని ఫీవర్‌, గాంధీ ఆస్పత్రులకు తరలించి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Also Read : వైరస్‌ నుంచి ఫేస్ మాస్క్‌లతో రక్షించుకోగలమా?