Increase Belly Fat : పొట్టలో కొవ్వు పెరుగుతుందా? అసలు కారణాలు ఇవే!
వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదూ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే ఇది ఎక్కువ. మెనోపాజ్ అనంతరం చేతులు, కాళ్లు, తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకుపోతుంది.

Does belly fat increase
Increase Belly Fat : వయసు మీద పడుతున్న కొద్దీ పొట్ట పెరగటం సహజమే. పురుషులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అయితే ఇది ఎంతోమంది స్త్రీలకు పెద్ద సమస్యగానే పరిణమిస్తుంది. శరీరాకృతినే మార్చేసి వయసు ముదిరినట్టు కనిపించేలా చేస్తుంది. పొట్ట వల్ల అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలుగుతుంది. శరీరంలో ఇతర భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ అస్కారం ఏర్పడుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు చేయటంతో దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అసలు పొట్ట ఎందుకొస్తుందంటే ;
వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదూ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే ఇది ఎక్కువ. మెనోపాజ్ అనంతరం చేతులు, కాళ్లు, తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకుపోతుంది. పొట్టలో చర్మం లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ప్రమాదకరమైనది. ఇది వంశ పారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉండగా, రుతువిరతి తర్వాత కలిగే హార్మోన్ల మార్పు కూడా దీనికి దోహదం చేస్తుంది. బరువు పెరగకుండా బొజ్జ పెరుగుతున్నా ప్రమాదకరంగా భావించాలి.
ఎత్తు బరువుల నిష్పత్తిని (బీ ఎం ఐ) బట్టి అధిక బరువును గుర్తించొచ్చు కానీ దీంతో శరీరంలో కొవ్వు శాతాన్ని తెలుసుకోలేం. కొవ్వు కు సంబంధించి నడుం చుట్టుకొలత ద్వారా పొట్ట భాగంలో కొవ్వు ప్రమాదకర స్థాయికి చేరుకున్న విషయాన్ని పసిగట్టొచ్చు. ముందు బొడ్డు భాగంలో కడుపు చుట్టూ టేపుతో కొలవాల్సి ఉంటుంది. నడుం చుట్టు కొలత 35 అంగుళాలుంటే కొవ్వు అదుపులోనే ఉన్నట్టు. 35 అంగుళాలకు మించితే అనారోగ్యకర కొవ్వు పేరుకుందనే అర్థం.
కొన్ని రకాల వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో పొట్టను తగ్గించుకోవచ్చు. రోజూ వ్యాయామం చేయటం అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. వ్యాయామం ద్వారా బరువుతో పాటు పొట్ట కూడా తగ్గుతుంది. పిండి పదార్థాలు గల పాలిష్ పట్టిన బియ్యం, గోధుమలు, బ్రెడ్, శుద్ధిచేసిన పాస్తాలకు బదులు సంక్లిష్ట పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తక్కువ తినటంతో పాటు కేలరీలనూ తక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతారు.