ఈ చికెన్ తిని చస్తున్నారు : దేశంలోని కోళ్లలో డేంజరస్ మెడిసిన్
ఒక రకమైన బ్యాక్టీరియా మన దేహంలోకి వెళ్లి జబ్బులు వస్తాయన్నారు. మన దేశంలో దీని కారణంగా ఏటా లక్ష మంది, ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మంది చనిపోతున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి.

ఒక రకమైన బ్యాక్టీరియా మన దేహంలోకి వెళ్లి జబ్బులు వస్తాయన్నారు. మన దేశంలో దీని కారణంగా ఏటా లక్ష మంది, ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మంది చనిపోతున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి.
అదో ప్రమాదకరమైన యాంటి బయోటిక్ మెడిసిన్. పశువులకు వాడతారు. ముఖ్యంగా కోళ్లు, మేకలు, గొర్రెలకు. ఈ యాంటీ బయోటిక్ కారణంగా పశువులు త్వరగా వృద్ది చెందుతాయి. స్వల్ప కాలంలోనే వాటిలో ఎదుగుదల కనిపిస్తుంది. ఆ యాంటి బయోటిక్ మెడిసిన్ పేరు జోయ్‌టిస్(Zoetis). గ్రోత్ ప్రమోటింగ్ యాంటి బయోటిక్స్‌గా వీటిని వినియోగిస్తారు. ఈ యాంటి బయోటిక్ మెడిసిన్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. నాన్ వెజ్ ప్రియుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చికెన్ లవర్స్‌ను కలవరపెడుతోంది.
యాంటి బయోటిక్ మెడిసిన్ జోయ్‌టిస్ చాలా డేంజర్ మెడిసిన్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనేజేషన్ తేల్చింది. ఇది మనుషులకు అత్యంత ప్రమాదకరం అని స్పష్టం చేసింది. ఈ యాంటి బయోటిక్‌తో పెరిగిన కోళ్లు, మేకలు, గొర్రెలు తిన్నవారికి భయంకరమైన జబ్బులు సోకుతాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఆ జబ్బులకు చికిత్సలు లేవని, వాటికి మందులు కూడా లేవని చెప్పింది. వీటి కారణంగా మనుషులు ప్రాణాలు పోతాయని వెల్లడించింది. ఈ యాంటి బయోటిక్ చాలా డేంజర్ అని చెప్పడమే కాదు.. వీటి అమ్మకాలపై బ్యాన్ కూడా విధించారు. అమెరికా, యూరప్‌లో ఈ మెడిసిన్‌ను బ్యాన్ చేశారు. అక్కడి రైతులకు, పశు పోషకులకు, పౌల్ట్రీ నిర్వాహకులకు ఈ మెడిసిన్ గురించి అవగాహన కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని వాడొద్దని వార్నింగ్ ఇచ్చారు.
భారత్‌లో మాత్రం జోయ్‌టిస్ అమ్మకాలు యథేచ్చగా జరుగుతున్నాయి. ఓపెన్ మార్కెట్‌లో పబ్లిక్‌గా అమ్మేస్తున్నారు. కంపెనీ వాళ్లు యాడ్స్ ఇచ్చి మరీ సేల్స్ జరుపుతున్నారు. అసలు విషయం తెలియని అమాయక రైతులు, పౌల్ట్రీ నిర్వాహకులు.. ఈ మందుని తెగ కొనేస్తున్నారు. వాటిని కోళ్లు, మేకలు, గొర్రెలకు వాడుతున్నారు. యూరప్, అమెరికాలో ఈ మెడిసిన్‌ను నిషేధించారు అని, ఇది చాలా డేంజర్ అని వారికి తెలియదు.
భారత్‌లో జోయ్‌టిస్ మెడిసిన్ అమ్మకాలపై పశు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బ్యాన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జోయ్‌టిస్ మందు మనుషులకు ఎంత ప్రమాదకరమో రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ఈ మెడిసిన్ ఎక్కించిన కోళ్లను తినే వాళ్లకు భయంకరమైన జబ్బులు వస్తాయని విషయాన్ని వారికి వివరించాలన్నారు. ఒక రకమైన బ్యాక్టీరియా మన దేహంలోకి వెళ్లి జబ్బులు వస్తాయన్నారు. మన దేశంలో దీని కారణంగా ఏటా లక్ష మంది, ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మంది చనిపోతున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వం అప్రమత్తం కావాలని, జోయ్‌టిస్ మెడిసిన్ అమ్మకాలపై బ్యాన్ విధించాలని, రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.