Summer: వేసవిలో అతిగా వాటర్ తాగుతున్నారా.. మీరు డేంజర్ లో ఉన్నట్లే.. రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలంటే..

రాత్రి నిద్ర పోయి ఉదయం నిద్ర లేచే సరికి శరీరంలో నీటి నిల్వలు తగ్గుతాయి. అందువల్ల ఉదయాన్నే ..

Summer: వేసవిలో అతిగా వాటర్ తాగుతున్నారా.. మీరు డేంజర్ లో ఉన్నట్లే.. రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలంటే..

Drinking water

Updated On : March 6, 2025 / 2:27 PM IST

Drinking water: వేసవి ప్రారంభంలోనే ఎండ మండిపోతుంది. మూడు నెలలు భానుడు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, ఒకవేళ వెళ్లినా ఎండ వేడిమి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యతాపాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. వేసవిలో తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవటం. చెమట ద్వారా పోయే నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాలి. అయితే, ఎక్కువ నీరు తాగినా ప్రమాదమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Drinking Water

ఓ మనిషి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలనే దానికి స్పష్టమైన లెక్కలు లేవు. కానీ, భౌగోళిక పరిస్థితులు, ఎండల తీవ్రత అంశాల ఆధారంగా ఓ మనిషి ఎన్ని నీళ్లు తాగాలనేది ఆధారపడి ఉంటుందని ఎక్కువ మంది వైద్య నిపుణుల అభిప్రాయం. తాగునీటి పరిమాణం అందరిలోనూ ఒకే విధంగా ఉండదని హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్పెషల్ హెల్త్ రిపోర్టు చెబుతోంది. ఓ మనిషి జీవన శైలి, పనిప్రదేశం, ఉష్ణోగ్రతలతోపాటు ఆరోగ్య సమస్యలు, తీసుకునే మందులు ఆధారంగానూ మంచి నీటిని తీసుకోవాలని ఆ నివేదిక పేర్కొంది.

Drinking water

రాత్రి నిద్ర పోయి ఉదయం నిద్ర లేచే సరికి శరీరంలో నీటి నిల్వలు తగ్గుతాయి. అందువల్ల ఉదయాన్నే కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. ఒక వ్యక్తి కార్యాలయాల్లో పనిచేసే వారైతే రోజుకు ఎనిమిది గ్లాసులు అంటే రెండు లీటర్ల నీళ్లు తాగాలి. అదే తీవ్రమైన ఎండలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వ్యసాయ కూలీలు, కార్మికుల శరీరం నుంచి చెమట రూపంలో నీటి నిల్వలు శరీరం నుంచి బయటికి పోతాయి. అందువల్ల అలాంటి వారు రోజుకూ కనీసం 3 నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Drinking water

అతిగా నీళ్లు తాగినా ఇబ్బందులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగితే శరీరంలోని సోడియం మూత్రంతో వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల అతిగా నీళ్లు తీసుకోవడం కూడా ముప్పే.

Drinking water

రక్తపోటు మందులు వాడుతున్న వారు నీటిని తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. రక్తపోటు మందులు శరీరంలో సోడియం లెవెల్స్ ను తగ్గిస్తాయి. రక్తపోటు మందులు తీసుకునేవారు నీళ్లు ఎక్కువగా తాగితే సోడియం లెవల్స్ మరింత వేగంగా తగ్గుతాయి. అదే జరిగితే మెదడు దెబ్బతిని మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్లే ముప్పు ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.