Heart attack: గుండెపోటు ముప్పునకు ఇలా సింపుల్‌గా దూరంగా ఉండండి..
కోచింగ్ సెంటర్‌లో పాఠాలు వింటూ కూర్చుకున్న చోటే ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయాడు ఓ విద్యార్థి. క్రికెట్ ఆడుతున్న వేళ, డ్యాన్స్ చేస్తున్న వేళ, వ్యాయామం చేస్తున్న సమయంలో...

Heart attack
మెడికల్ షాప్ వద్ద నిలబడి అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు ఓ వ్యక్తి. కోచింగ్ సెంటర్‌లో పాఠాలు వింటూ కూర్చుకున్న చోటే ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయాడు ఓ విద్యార్థి.
క్రికెట్ ఆడుతున్న వేళ, డ్యాన్స్ చేస్తున్న వేళ, వ్యాయామం చేస్తున్న సమయంలో… ఇలా చాలా మంది హార్ట్ అటాక్ కారణంగా మృత్యువాత పడుతున్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. కనీసం 30 ఏళ్లు నిండని వారూ గుండెపోటుకు గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ ముప్పు మనకు ఎదురు కాకుండా దూరంగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
అరటి పండుతో ఈ ఆహారం జత చేసి తింటున్నారా? ఎంత ప్రమాదకరమో తెలుసా…
ఈ జాగ్రత్తలు పాటించండి..
- ఆరోగ్యకరమైన ఆహారం తినాలి
- నూనె పదార్థాలు అతిగా తినొద్దు
- ప్రతిరోజు కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి
- ధ్యానం, యోగా చేయాలి
- మెట్లెక్కడం, నడవడం మంచిది
- బీఎంఐ ఎక్కువ కాకుండా చూసుకోవాలి
- మధుమేహం, బీపీ అదుపులో ఉంచుకోవాలి
- ధూమపానం చేయవద్దు, పొగాకు వాడవద్దు
- గంటల తరబడి ఒకేచోట కూర్చోవద్దు
- మానసిక సమస్యలు లేకుండా చూసుకోవాలి
- ఒత్తిడి తగ్గించుకోవాలి
- బీపీ/షుగర్ ఉంటే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అరటి పండుతో ఈ ఆహారం జత చేసి తింటున్నారా? ఎంత ప్రమాదకరమో తెలుసా…