Neem Benefits : వేపతో బహుళ ప్రయోజనాలు! కొవ్వును కరిగించటంతోపాటు, జీర్ణ వ్యవస్ధను మెరుగుపరచటంలో..
శరీరం లోపల, శరీరం బయట వేపను వాడటం ద్వారా హానికరమైన బ్యాక్టీరియాలు అధికంగా పెరగకుండా నిరోధించవచ్చు. తద్వారా పూర్తి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేప జ్యూస్ రూపంలో తాగటం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

Neem-benefits
వేప చెట్టు ఎన్నో లాభదాయకమైన రసాయనముల సమ్మేళనము. బెరడు మొదలుకొని వేపాకుల దాకా, ఆఖరికి పూలు, పళ్ళు , విత్తనాలు, వేరులు ఇలా వేప చెట్టులోని అన్ని భాగాలు అనేక రకాల రుగ్మతలను సరి చేయడంలో ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఔషధ గుణాలున్న చెట్టుగా పేరుగాంచిన శక్తివంతమైన వృక్షం. ఆయుర్వేదంలో వేప చెట్టును సహజ ఔషధాలయంగా పరిగణిస్తారు. వేప యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉన్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది.
ప్రాచీనకాలం నాటి ఆయుర్వేద గ్రంథాలలో, వేప చర్మ రుగ్మతలను, జుట్టు సమస్యలను ఎలా పోగొడుతుందో వివరించారు. ఆకలిని పెంచటంలో, జీర్ణక్రియను మెరుగుపర్చటంలో, కడుపులోని జఠరాగ్నిని పెంచటంలో, శ్వాసను మెరుగుపరచటంలో, మధుమేహ పరిస్థితులను నిర్వహించడానికి సహాయపడటంలో, గాయాలను నయం చేయడంలో ,వికారం నుండి ఎలా ఉపశమనం కలగించటంలో ఎలా సహాయపడుతుందో వివరించారు.
శరీరం లోపల, శరీరం బయట వేపను వాడటం ద్వారా హానికరమైన బ్యాక్టీరియాలు అధికంగా పెరగకుండా నిరోధించవచ్చు. తద్వారా పూర్తి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేప జ్యూస్రూ పంలో తాగటం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. పేగులలోని మలాన్ని శుభ్రపరచడానికి, శరీరం మల విసర్జన ప్రక్రియను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. మెటబాలిజంను కూడా గణనీయంగా మెరుగుపరుస్తుంది.
వేపలో యాంటీ బ్యాక్టీరియల్, ఏంటి సెప్టిక్ ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి. బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడం ద్వారా రక్తాన్ని శుద్ధిచేస్తుంది. దంతాల పాచిని , నోటిలో ఉండే బ్యాక్టీరియాను తగ్గించటంలో, వేప బెరడు పెట్టింది పేరు. ఈ కారణంగానే, వేప పుల్లలను పురాతనకాలం నాటి నుండి టూత్ బ్రష్ గా ఉపయోగిస్తున్నారు. వేప చెట్టులోని అన్ని ఇతర భాగాలలో లాగానే, వేప వేళ్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అయితే కొంత మంది మాత్రం వేపను తీసుకోరాదు. అతిగా వినియోగించటం కూడా మంచిదికాదు. గర్భిణీ స్త్రీలు వేపను తీసుకోకూడదు. వేపను అతిగా తీసుకోవడం అనేది వీర్యకణాలను చంపుతుంది. వేప తీసుకోవటం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీనిని తగ్గించుకునేందుకు నీటిని అధిక మోతాదులో తీసుకోవటం మంచిది.