ENO Side Effects: ENO ఎక్కువగా తాగుతున్నారా.. మీకు తెలియకుండానే మరో సమస్య.. జాగ్రత్తగా ఉండండి
ENO Side Effects: ENO అనేది ఒక యాంటాసిడ్ పౌడర్. ఇది సాధారణంగా గ్యాస్, అజీర్నం, ఎసిడిటీ వంటి సమస్యలకు తక్షణ ఉపశమనాన్ని ఇవ్వడానికి వాడతారు.

Problems caused by excessive use of ENO
మనం తిన్న ఆహారం సరిగా అరగకపోయినా? లేదా ఎసిడిటీ సమస్యలు వచ్చినా చాలా మంది వెంటనే “ENO” తాగుతారు. ఇది చాలా త్వరగా ప్రభావాన్ని చూపించి సత్వర ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే చాలా మంది ENOని ఈజీగా వాడేస్తున్నారు. అయితే, ఎప్పుడో ఒకప్పుడు అంటే పరవాలేదు కానీ, తరుచుగా వాడకం మాత్రం అనారోగ్యానికి దారితీస్తుంది అను చెప్తున్నారు నిపుణులు. మరి ఆ సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు ENO అంటే ఏమిటి?
ENO అనేది ఒక యాంటాసిడ్ పౌడర్. ఇది సాధారణంగా గ్యాస్, అజీర్నం, ఎసిడిటీ వంటి సమస్యలకు తక్షణ ఉపశమనాన్ని ఇవ్వడానికి వాడతారు. ఇది ముఖ్యంగా సోడియం బైకార్బోనేట్ (సొడా), సిట్రిక్ యాసిడ్, సోడియం కార్బోనేట్ వంటి పదార్థాలతో తయారవుతుంది. ఇది నీటిలో కలిపి తాగినప్పుడు అజీర్నం వల్ల వచ్చే ఆమ్ల స్రావాన్ని తక్కువ చేస్తూ, కడుపులో హాయిగా అనిపించేలా చేస్తూ తాత్కాలిక, సత్వర ఉపశమనం కలిగిస్తుంది.
ENO ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సమస్యలు:
1.సోడియం అధికంగా చేరడం:
ENOలో సోడియం అధికంగా ఉంటుంది. దీన్ని తరచూ తీసుకుంటే శరీరంలో సోడియం స్థాయి పెరిగి, హై బ్లడ్ ప్రెజర్ (రక్తపోటు) వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
2.కడుపు సమస్యలు:
ENO తాగడం వల్ల తాత్కాలిక ఉపశమనం కలిగినా.. తరచూ వాడడం వల్ల శరీరం సహజమైన జీర్ణక్రియ మీద ఆధారపడకుండా పోతుంది. ఇది దీర్ఘకాలిక అజీర్నం లేదా ఆమ్లవ్యాధికి దారితీయొచ్చు.
3.మూత్రపిండాలపై ప్రభావం:
ENOలో ఉండే బైకార్బొనేట్ పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది ప్రమాదకరం.
4.అసిడిటీ సమస్యకు ఉపశమనం మాత్రమే ఇస్తుంది:
ENO ఎసిడిటీ వల్ల వచ్చే లక్షణాలను తాత్కాలికంగా తగ్గిస్తుంది కానీ, కారణాన్ని నివారించదు. కాబట్టి, దీర్ఘకాలంలో సమస్య తీవ్రం అవుతుంది.
ENO ఎప్పుడు వాడాలి?
వాడవచ్చు:
- ఒక్కసారిగా అజీర్నం, ఎసిడిటీ ఏర్పడినప్పుడు
- భోజనం తర్వాత ఒత్తిడిగా అనిపించినప్పుడు
వాడరాదు:
- రోజు వారీగా, ప్రతి భోజనం తర్వాత
- గర్భవతులైతే, మూత్రపిండాల సమస్యలుంటే
- హై బీపీ ఉన్నవారు.
ENOకి బదులుగా ఏం వాడాలి?
- మసాలాలు తక్కువగా ఉన్న భోజనం తీసుకోవాలి
- ఆహారాన్ని సరిగ్గా నమిలి తినాలి
- భోజనం తర్వాత తేలికపాటి నడక మంచిది
- అజీర్నం, ఎసిడిటీ తరచూ వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి.