పళ్లు తెల్లగా అవ్వాలని ఇంతింత పేస్టేసి రప్పా రప్పా తోమేస్తున్నారా?.. ఒక్క నిమిషం..
మిల మిల మెరువాలనో, దుర్వాసన పోవాలనో ఎక్కువ టూత్‌పేస్ట్ వాడుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్..

ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం వలన మీ దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండడంతో పాటు, రాత్రిపూట నోటిలో పెరిగే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే, టూత్‌పేస్ట్‌ను ఎక్కువగా వాడితే దంతాలు తెల్లగా మిలమిల మెరుస్తాయిని అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే.. టూత్‌పేస్ట్‌ను అధికంగా వాడటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి..
బ్రష్ చేసేటప్పుడు మీరు టూత్ పేస్ట్ మోతాదుని సరిగా నియంత్రించాలి. పెద్దవాళ్లు అయితే టూత్‌పేస్ట్ ని బఠానీ గింజ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఇది మీ దంతాలను పూర్తిగా క్లీన్ చేసేందుకు సరిపోతుంది. పిల్లల విషయంలో అయితే బఠానీ గింజ కన్నా తక్కువ పరిమాణంలో టూత్‌పేస్ట్ ని ఉపయోగించాలి, అధికంగా ఉపయోగించడం వలన నోటి ఆరోగ్యానికి హానికరమని గుర్తుంచుకోవాలి. (చదవండి: కాఫీ ఎన్నిసార్లు కాదన్నయ్యా.. ఎప్పుడు తాగామన్నదే ఇంపార్టెంట్.. కొత్త సర్వేలో కొత్త విషయాలు.. )
దంతాలు బలంగా ఉండడం కొరకు సోడియం ఫ్లోరైడ్ అనే పదార్థాన్ని ఉపయోగించి టూత్‌పేస్ట్‌ని తయారు చేస్తారు. సోడియం ఫ్లోరైడ్ ని తక్కువ మోతాదులో వాడితే ఎలాంటి నష్టం ఉండదు కానీ ఎక్కువగా వాడితేనే నోటి ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా చిన్న పిల్లలు తక్కువ టూత్‌పేస్ట్‌ను వాడితే ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో.. అలాగే ఎక్కువ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించితే చిన్న పిల్లల్లో ఫ్లోరోసిస్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇంకో చిన్న విషయం ఏంటంటే.. బ్రష్ చేసిన తర్వాత తేలికగా పుక్కిలించి ఉమ్మేలా చిన్న పిల్లలకు అలవాటు చేయాలి అలాగే టూత్‌పేస్ట్ మింగకుండా చూసుకోవాలి. టూత్‌పేస్ట్ ఎక్కువగా వాడడం వలన దంతాలు నెమ్మదిగా బలహీనంగా మారి, ఊడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనికన్నా ముందు పిల్లల పళ్ల రంగు మారిపోయి, ట్రీట్మెంట్ తీసుకోకపోతే పళ్లు పుచ్చిపోయే అవకాశాలు ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: మీరు కూడా ఆఫీస్ లో గంటలు గంటలు కూర్చొని పని చేసే బ్యాచ్ లోనే ఉన్నారా?.. మీకు ఓ షాకింగ్ న్యూస్.. )
నోటి నుండి వచ్చే దుర్వాసన తో మీకు సమస్య ఉన్నట్లయితే మౌత్ ఫ్రెషనర్స్‌ను డాక్టర్ ల సలహా మేరకే వాడాలి. ముఖ్యంగా మౌత్ ఫ్రెషనర్స్ నోటి దుర్వాసన, నోట్లో ఉన్న బ్యాక్టీరియా లను తగ్గించడానికి బాగా పనిచేస్తాయి.
Disclaimer: ఇందులో ఉన్న విషయాలను మేము ధ్రువీకరించలేదు.. కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యడానికి, అవగాహన కోసమే ఈ ఆర్టికల్ ని పోస్ట్ చేశాము.