మీరు కూడా ఆఫీస్ లో గంటలు గంటలు కూర్చొని పని చేసే బ్యాచ్ లోనే ఉన్నారా?.. మీకు ఓ షాకింగ్ న్యూస్..
ఎలాంటి కదలిక లేకుండా గంటల పాటు కూర్చోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.. వాటి నివారణ ఏంటో తెలుసుకుందాం..?

వర్కింగ్ ఎంప్లాయిస్, బిజినెస్ చేసే వారు లేదా ఇతరులు ఎలాంటి వర్కౌట్ లేకుండా రోజు గంటల తరబడి కూర్చునే ఉంటారు. ఇప్పుడు బాగానే ఉంటారు కానీ ఫ్యూచర్ లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు తో మీరు పోరాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు అసలు ఎలాంటి సమస్యలు వస్తాయి దానికి నివారణలు ఏంటో తెలుసుకుందాం..?
బ్రేక్ తీసుకోకుండా కూర్చోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు:
1) వెన్ను నొప్పి, మెడ నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ.
2) శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువ. శారీరక వ్యాయామం లేకపోతే మెటబాలిజం మందగించి, అధిక బరువు, స్థూలకాయం (ఒబేసిటీ) సమస్యలు రావచ్చు.
3) శారీరక చలనము లేకపోవడం వలన రక్తప్రసరణ తగ్గి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ పెరుగుదలకు, రక్తపోటు సమస్యలకు దారితీస్తుంది.
4) చైర్ లో గంటల పాటు కూర్చోవడం వల్ల శరీర చక్కెర స్థాయిలపై ప్రభావం చూపించి డయాబెటీస్ కి దారి తీస్తుంది. కూర్చు నుండి లేచి కదలకపోతే ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోగా, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
5) శారీరక చలనం లేకపోవడంతో రక్తప్రసరణ మందగించి, ఏకాగ్రత తగ్గిపోయి, మెదడు పనితీరు కూడా తగ్గిపోతుంది.
వీటి ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలకు పరిష్కరం ఏంటంటే..?
వెన్ను మద్దతిచ్చే విధంగా కుర్చీని ఎంచుకొని, చేతులు, మెడ, వెన్ను కొద్దిగా ఒరిగేలా స్ట్రెచింగ్ చేయండి. నిటారుగా వెన్ను ఉంచి వర్క్ చేసుకోవాలి. తొడలపై కాళ్లు పెట్టుకోవడం వలన రక్త ప్రసరణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. చైర్‌కి అతుక్కుపోయినట్టుగా అనిపిస్తే, అలారం పెట్టుకుని ప్రతిసారీ లేచి కాస్తా నడవలి. చిన్నచిన్నవి ఇప్పుడు చేస్తేనే భవిష్యత్ లో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
ప్రతి గంటకు ఒక్కసారి లేచి నడవడం, నీళ్లు తాగడం, కుర్చీలోనే తేలికపాటి వ్యాయామాలు చేయడం వంటి వలన కొంత మేరకు ఆరోగ్య సమస్యలు తగ్గించవచ్చు. కొన్నిసార్లు స్టాండింగ్ డెస్క్ వాడటం కూడా ఉత్తమమే. ఆరోగ్యంగా ఉండాలంటే కదలిక తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.
Disclaimer: ఇందులో ఉన్న విషయాలను మేము ధ్రువీకరించలేదు.. కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యడానికి, అవగాహన కోసమే ఈ ఆర్టికల్ ని పోస్ట్ చేశాము.