Oral Cancer : స్మార్ట్ ఫోన్ తో నోటి క్యాన్సర్ గుర్తించవచ్చు.. ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

ఐహబ్ డాటా, ఐఎన్ఏఐతో కలిసి నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో మంచి ఫలితాలు వచ్చినట్లు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు పేర్కొన్నారు.

Oral Cancer : స్మార్ట్ ఫోన్ తో నోటి క్యాన్సర్ గుర్తించవచ్చు.. ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

smart phone detect Oral Cancer

Smart Phone Detect Oral Cancer : రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చు. వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ప్రధాన సవాలుగా మారింది. అయితే దీన్ని అధిగమించడంలో ఆధునిక సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అనేక రోగాలను గుర్తించి వాటిని నయం చేస్తున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్ ఫోన్ తోనే నోటి క్యాన్సర్(ఓరల్ క్యాన్సర్)ను గుర్తించవచ్చని తేలింది.

దీనిపై ఐహబ్ డాటా, ఐఎన్ఏఐతో కలిసి నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో మంచి ఫలితాలు వచ్చినట్లు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు పేర్కొన్నారు. ఏఐ సాయంతో పలు సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ప్రముఖ చిప్ కంపెనీ ఇంటెల్ ఐఎన్ఏఐ పేరుతో ట్రిపుల్ ఐటీలో ఓ రిసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.

Tech Tips In Telugu : గూగుల్ క్రోమ్‌లో మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ చాట్ ఎలా వాడాలో తెలుసా?

ఇందులో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నోటిలోని గాయాలను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సుతోపాటు మెషీన్ ల్యాంగ్వేజ్ లను ఉపయోగించి ప్రత్యేక మొబైల్ యాప్ ను రూపొందించారని ఐఎన్ఏఐ సీఈవో కోనాల వర్మ తెలిపారు. ఈ యాప్ సాయంతో నోటి క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని వెల్లడించారు. ప్రయోగ దశలో విజయవంతమైన ఈ విధానాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.