రవి ప్రకాష్, శివాజీలకు నోటీసులు

  • Published By: veegamteam ,Published On : May 9, 2019 / 09:47 AM IST
రవి ప్రకాష్, శివాజీలకు నోటీసులు

Updated On : May 9, 2019 / 9:47 AM IST

TV9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ ఇంటికి పోలీసుల బృందం వెళ్లింది. అతను ఇంట్లో లేకపోవటంతో.. భార్యకు 160 సీఆర్ పీసీ నోటీసులు అందజేశారు. 2019, మే 10వ తేదీన పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీస్ ద్వారా స్పష్టం చేశారు. రవి ప్రకాష్ తోపాటు సినీ నటుడు శివాజీకి కూడా నోటీసులు ఇచ్చారు. ఏడు బృందాలతో రవి ప్రకాష్ ఇంట్లో తనిఖీలు చేశారు పోలీసులు. ఎక్కడున్నారన్నదానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. 

అలంద మీడియా కంప్లయింట్ ఆధారం ఫోర్జరీ కేసులు నమోదు చేసిన పోలీసులు.. TV9 కార్యాలయంలో కూడా సోదాలు చేశారు. కంప్లయింట్ లో ఉన్న అభియోగాలపై వివరణ ఇవ్వాలని కోరారు. వాటాల బదలాయింపు, నిధుల తరలింపు, ల్యాప్ ట్యాప్, ఇతర వస్తువులను ఆఫీస్ నుంచి మాయం చేయటం వంటి అంశాలపై విచారణకు హాజరుకావాలని ఆదేశించారు పోలీసులు. అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఫిర్యాదుపై కేసులు నమోదు చేసి.. నోటీసులు అందించారు.