3 నెలల్లో 24లక్షలు అప్ : తెలంగాణ ఓటర్లు 2.95 కోట్లు
రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల 95 లక్షల 18 వేల 964 మంది ఓటర్లు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల 95 లక్షల 18 వేల 964 మంది ఓటర్లు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల 95 లక్షల 18 వేల 964 మంది ఓటర్లు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. 17.72 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. ఓటర్ల సంఖ్య మరింత పెరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 24 లక్షల ఓటర్లు పెరిగారని తెలిపారు. పెరిగిన ఓటర్లలో తొలి యువ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల నమోదు కోసం మార్చి 2, 3 వ తేదీలలో మరో దఫా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ఫిబ్రవరి 22 శుక్రవారం ముగిసింది. ఈమేరకు రజత్ కుమార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు.
Read Also: సక్కగా వెళ్లటం లేదా : హైదరాబాదీలు కట్టాల్సిన ట్రాఫిక్ ఫైన్స్ రూ.63 కోట్లు
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2 కోట్ల 95 లక్షల 18 వేల 964. వీటిలో పురుష ఓటర్లు కోటి 48 లక్షల 42 వేల 619. మహిళా ఓట్లరు కోటి 46 లక్షల 74 వేల 977. థర్డ్ జెండర్ ఓటర్లు వెయ్యి 368. సర్వీసు ఓటర్లు 10 వేల 307. ఎన్ఆర్ఐ ఓటర్లు వెయ్యి 122. దివ్యాంగ ఓటర్లు 4 లక్షల 69 వేల 30. 18-19 వయస్సు గల ఓటర్లు 5 లక్షల 99 వేల 933 మంది ఉన్నారు.
రాష్ట్రంలో లక్షా 95 వేల 369 డూప్లికేట్ ఓటర్లు, 44 వేల 721 మృతి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. కొత్త ఓటర్ల జాబితా ప్రకటనతో ఓటర్లు, జనాభా నిష్పత్తి పెరిగింది. అది 738 నుంచి 762కు చేరింది. స్త్రీ, పురుష నిష్పత్తి 982 నుంచి 989కి పెరిగింది.
Read Also: ఇదెక్కడి చోద్యం : బేకరీలోని కరాచీని కప్పేస్తున్న వ్యాపారులు
Read Also: గెట్ రెడీ : రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్