తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 02:38 PM IST
తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

Updated On : December 19, 2019 / 2:38 PM IST

తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం (డిసెంబర్ 19, 2019) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో రెండు, మిగతా జిల్లాల్లో ఒక్కొ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. జులై 25న సుమోటో పిటిషన్ విచారణ సందర్భంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 5వ తేదీన అన్ని రాష్ట్రాల హైకోర్టులకు కేంద్ర న్యాయశాఖ లేఖలు రాసింది. దీని ఆధారంగా డిసెంబర్ 5న తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అందులో సుప్రీంకోర్టు ఆదేశాల సారాంశాన్ని వివరించింది. 

మరోవైపు ఈ కేసుల్లో సత్వర విచారణ జరగాలంటూ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేయనున్నాయి.