గాంధీ హాస్పిటల్లో 80ఏళ్ల వృద్ధుడికి స్వైన్ ఫ్లూ

హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో 80ఏళ్ల వృద్ధుడికి స్వైన్ ఫ్లూ సోకినట్లుగా డాక్టర్లు గత కొన్ని రోజులుగా ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్న సదరు వృద్ధుడుకి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లుగా అనుమానం రావటంతో అతడిని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. గాంధీకి తీసుకు వచ్చిన అతడికి పరీక్షలు చేయగా స్వైన్ ఫ్లూ సోనికినట్లుగా డాక్టర్లు నిర్దారించారు. దీంతో స్వైన్ ఫ్లూ రోగుల సంఖ్య రెండుకు చేరింది.
యాదాద్రి భువన గిరి జిల్లా నుంచి వచ్చిన సదరు వ్యక్తి గత కొన్ని రోజులుగా ఇతర అనారోగ్య కారణాలతో ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా..స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తంచేసిన డాక్టర్లు అతడి రక్త నమూనాలను సేకరించి గాంధీ హాస్పిటల్ కు పంపించారు.
దీంతో అతడికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లుగా నిర్దారణ కావటంతో గాంధీనికి తరలించి వెంటిలేటర్ పై చికిత్సనందిస్తున్నారు. కాగా స్వైన్ ఫ్లూ బాధితుల కోసం గాంధీ హాస్పిటల్ లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి బాధితులకు చికిత్సనందిస్తున్నారు.