టీఆర్ఎస్ సభ్యులకు ప్రమాద బీమా : కేటీఆర్

హైదరాబాద్ : రైతులతోపాటు టీఆర్ఎస్ సభ్యులకు ప్రమాద బీమా వర్తింపచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రైతు బీమాలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బీఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన చెక్కులు పంపిణీ చేశారు. పేదలకు సహాయం చేయాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలకు పార్టీ నేతలు ముందుకు రావాలని కేటీఆర్ పిలుపిచ్చారు. ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పై కేటీఆర్ ప్రశంసలు కురింపించారు. రాష్ట్రానికి ఎయిమ్స్ తేవడంలో ఎంపీ బూరది కీలక పాత్రని కొనియాడారు.