బీ ఎలర్ట్ : మరో రెండు రోజులు వానలే 

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 04:08 AM IST
బీ ఎలర్ట్ : మరో రెండు రోజులు వానలే 

Updated On : October 2, 2019 / 4:08 AM IST

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. విభాగం తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో.. హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురిశాయి. 

హైదరాబాద్, వరంగల్, మెదక్, మంచిర్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిశాయి. రానున్న మరో రెండు రోజుల్లో కోస్తాంధ్రలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలియజేసింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా కోస్తాంధ్రతోపాటు దేశంలోని తూర్పు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్కేమెట్ తెలిపింది. ఈ  ప్రభావం మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉంటుందని తెలిపింది. 

పండుగ రోజు సెలవు కావడం..వర్షాలు భారీగా కురుస్తుండటంతో హైదరాబాద్ నగరంలో వాహనదారులకు నానా అవస్థలు పడుతున్నాయి.