బిగ్ సీ షోరూమ్ చోరీ కేసు :  మూడేళ్లకు దొరికిన దొంగ 

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 11:11 AM IST
బిగ్ సీ షోరూమ్ చోరీ కేసు :  మూడేళ్లకు దొరికిన దొంగ 

Updated On : January 12, 2019 / 11:11 AM IST

హైదరాబాద్ : గోడకు కన్నం వేసి రూ.5.5 లక్షల విలువైన 35 స్మార్ట్ ఫోన్స్ ను..6 మెమరీ కార్డ్స్ ను  అత్యంత చాకచక్యంగా కొట్టేసిన దోపీడీ కేసును మూడేళ్లకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు.  సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 24 ఫోన్స్ ను రికవరీ చేసినట్లుగా కమిషన్ అంజనీ కమార్ ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు. 

2015లో జరిగిన చోరీ మూడేళ్లకు 
పటాన్ చెరు ఆర్సీ పురంలోని బిగ్ సీ షోరూమ్ లో 2015లో భారీ చోరీ జరిగింది. ఈ కేసును వెస్ట్ జోన్ పోలీసులు మూడు సంవత్సరాల నుండి కొనసాగుతున్న ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ భారీ చోరీలో నిందితుడ్ని నగరంలోని బహద్దూర్ పురాకు  చెందిన బైజుల్లా ఖాన్ గా గుర్తించారు. 

జల్సాలకు అలవాటు…నేరాల బాటలో ఫయాజ్
సికింద్రాబాద్ లో పాత గడియారాలు బాగుచేయటం..అల్లం, వెల్లుల్లి వ్యాపారం చేసుకునే ఫాయజ్ తండ్రి జీవనం సాగించేవాడు. ఫయాజ్ కూడా ఫయాజ్ చిన్నప్పటి నుండి కూలిపనిచేసుకునేవాడు.  క్రమంలో జల్సాలకు అలవాటు పడిన 35 ఏళ్ల బైజుల్లా ఖాన్ అలియాస్ ఫయాజ్ గా దొంగగా మారి చిన్న చిన్న దొంగతనాల నుంచి గోడకు కన్నం వేసి ఏకంగా మొబైల్ షోరూమ్ ను కొట్టేసే స్థాయికి చేరుకున్నాడని కమిషన్ అంజనీకుమార్ తెలిపారు. చెడు అలవాట్లకు లోనైన 2005 నుండి బైజుల్లా దొంగతనాలకు అలవాటుపడ్డాడన్నారు. నగరంలో దోపిడీ దొంగల హల్ చల్ తో నిరంతరం నిఘా పెట్టినా దోపిడీలు మాత్రం కొనసాగుతున్న క్రమంలో మూడేళ్లకు సీసీ టీవీ పుటేజ్ తో నగరంలోనే జల్సాగా..స్వేచ్ఛగా తిరుగతున్న ఫయాజ్ ను పట్టుకోవటానికి మూడేళ్ల కాలం పట్టటం గమనించాల్సిన విషయం.