పట్టపగలు అడ్వకేట్ పై కత్తులతో దాడి
మాసాబ్ ట్యాంక్ వద్ద ఓ అడ్వకేట్ పై యాసిడ్,కత్తులతో దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ దాడితో న్యాయవాదికి తీవ్ర గాయపడ్డాడు.

మాసాబ్ ట్యాంక్ వద్ద ఓ అడ్వకేట్ పై యాసిడ్,కత్తులతో దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ దాడితో న్యాయవాదికి తీవ్ర గాయపడ్డాడు.
హైదరాబాద్ : మాసాబ్ ట్యాంక్ వద్ద ఓ అడ్వకేట్ పై యాసిడ్,కత్తులతో దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ దాడితో న్యాయవాదికి తీవ్ర గాయపడ్డాడు. ఈ ఘటన నాంపల్లి స్టేషన్ పరిధిలో గురువారం (ఏప్రిల్ 11)న చోటుచేసుకుంది.
Read Also : ఆకతాయి అసభ్య ప్రవర్తన : చెంప పగలగొట్టిన ఖుష్బూ
శాలిబండ చందులాల్ బేలాకు చెందిన న్యాయవాది శైలేశ్ సక్సేనా అనే న్యాయవాది కూరగాయల కొనుకొనేందుకు మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని మోర్ సూపర్ మార్కెట్‌కు వచ్చాడు. అన్నీ తీసుకున్ని బైటకు వస్తుండగా ఇదే అదనుగా కాపు కాచిన శ్రీనివాస్ అనే వ్యక్తీ అతని అనుచరులు కలిసి ఒక్కసారిగా శైలేశ్ పై కత్తులు, యాసిడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో శైలేశ్ కు గొంతు, కుడి భుజం, చేతి, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి.
ఈ క్రమంలో అక్కడే ఉన్న శైలేశ్ బావమరిది భుపేందర్‌రాథోడ్ వారిని అడ్డుకునేందుకు యత్నించగా..అతనిపై దాడికి పాల్పడగా అనికి కూడా గాయలయ్యాయి. గాయాలతోనే భుపేందర్ రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసి బావను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నానమి ఎస్‌ఐ పెంటాగౌడ్ తెలిపారు. భూపేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దాడి వెనుక పాత కక్షలున్నాయా? లేదా వేరే కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.