అధికారుల వేధింపులు : పెట్రోల్ పోసుకుని స్టేషన్ ముందే ASI ఆత్మహత్యాయత్నం 

  • Published By: veegamteam ,Published On : November 22, 2019 / 11:06 AM IST
అధికారుల వేధింపులు : పెట్రోల్ పోసుకుని స్టేషన్ ముందే ASI ఆత్మహత్యాయత్నం 

Updated On : November 22, 2019 / 11:06 AM IST

హైదరాబాద్ లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్  పరిథిలో ఏఎస్సై ఆత్మహత్యకు యత్నించాడు. బాలాపూర్ పీఎస్ లో ఏఎస్సైగా పనిచేస్తున్న నరసింహ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలు కావటంతో నరసింహను వెంటనే పోలీసులు అపోలో డీఆర్డీవో హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.

గత కొంత కాలంలో నరసింహను ఉన్నతాధికారులు డబ్బులు కోసం వేధిస్తున్నారనీ..వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నించినట్లుగా తెలుస్తోంది. డబ్బులు తీసుకురాకుంటే ట్రాన్సఫర్ చేస్తామని బెదిరిస్తున్నారనీ..అందుకే ఆత్మహత్యకు యత్నించినట్లుగా నరసింహ బంధువులు వాపోతున్నారు.
ఐదు నెలల నుంచి వేధిస్తున్నారనీ డబ్బులు ఇవ్వలేక..ఉద్యోగం చేయలేక..నరసింహ  మానసికంగా నలిగిపోతూ..చివరకు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించినట్లుగా తెలుస్తోంది. అపోలో హాస్పిటల్ లో చికిత్సపొందుతున్న నరసింహ పరిస్థితి విషయంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.