కంటిపాపకు బయోమెట్రిక్ : ఐరిస్ తోనే రేషన్..

రేషన్ కావాలంటే ఐరిస్ తప్పనిసరి
బయోమెట్రిక్ తో ఐరిస్ అనుసంధానం
ఐరిస్ టెస్ట్ తోనే రేషన్ పంపిణీ
హైదరాబాద్ లో సరికొత్త విధానం
హైదరాబాద్ : పౌర సరఫరాలశాఖ పంపిణీలో పారదర్శకత కోసం అధికారులు మరో సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకూ బయోమెట్రిక్ ద్వారా రేషన్ సరుకుల పంపిణీ మంచి ఫలితాలు ఇస్తున్న క్రమంలో తాజాగా ‘ఐరిస్’ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇటీవలే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ విధానం అమలులోకి వచ్చింది. మరో రెండు నెలల్లో గ్రేటర్ పరిధిలోకి కూడా అమలులోకి రానుంది. ఐరిస్ పద్ధతిలో తీసిన కంటిపాపను బయోమెట్రిక్‌ను సంధానం చేయడం ద్వారా ఐరిస్ పద్ధతిలో రేషన్ సరుకుల పంపిణీ సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. ఈ పద్ధతితో సక్రమంగా సరుకుల పంపిణీ అమలో పారదర్శకత వుంటుందన్నారు.
అక్రమాలకు పాల్పడే రేషన్ డీలర్లపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికార్లు తెలిపారు. నిజానికి బయో మెట్రిక్ పద్ధతిలో రేషన్ సరుకుల పంపిణీ మొదట గ్రేటర్‌పరిధిలో అమలు చేయటం..అది విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. తాజాగా ఐరిస్ పద్ధతిని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు.
ఈ క్రమంలో కాయకష్టం చేసే వారికి..వృద్ధులకు సంబంధించిన వేలి ముద్రలు అరిగిపోవడం వల్ల బయోమెట్రిక్‌లో వారి వేలి ముద్రలు స్పష్టంగా ఐడెంటిఫై కాకపోవటంతో..ఇదే అదనుగా తీసుకుంటున్న కొందరు రేషన్‌డీలర్లు చాలా మందికి సరుకులు ఇవ్వకుండానే వెనక్కి పంపిస్తున్నారు. దీంతో వారికి సరుకులు ఇచ్చేసినట్లుగా డీలర్లు అక్రమాలకు పాల్పడు ఆ సరుకులను బ్లాక్‌లో అమ్మేసుకుంటున్నారు. ఈ పరిస్థితి గ్రేటర్ లో కూడా తలెత్తుతోంది. అందుకే ఈ ఐరిష్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు అధికారులు.
ఈ అంశంపై ఇటీవల పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ సైతం పలు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను పరిస్థితిని పరీశీలించిన మేరకు ఈ ఐరిస్ ఒక్కటే సమస్యలకు పరిష్కారమని దశల వారీగా ఈవిధానాన్ని అమలుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
బయోమెట్రిక్ ద్వారా సరుకుల పంపిణీలో అన్నిచోట్ల మాదిరిగానే పరిధిలోని 9సర్కిళ్లలో 702 రేషన్‌షాపులకు కలిపి మొత్తం 12,500 కార్డులు ఉండగా వారికి బయో మెట్రిక్ ద్వారానే ఇస్తున్నారు. గ్రామాల నుండి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడినవారు కూలి చేసుకునే వారిలో చాలా మందిలో బొటనవేలి ముద్రలు అరిగిపోవడం వల్ల బయోమెట్రిక్ పద్ధతిలో సరుకులు తీసుకోలేకపోతున్నారు. చాలా రేషన్‌షాపుల్లో ప్రతి నెలా సరుకులు తీసుకునేందుకు వెళ్లిన వారిలో ఇటువంటి సమస్యలు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. కాబట్టి ఇక హైదరాబాద్‌లోనూ ఐరిస్ పద్ధతిలో రేషన్ సరుకులు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో అర్హులైన వారికి కచ్చితంగా సరుకులు అందేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు.
ఐరిస్‌ను స్వాగతిస్తున్న రేషన్ డీలర్స్…
పౌరసరపరాలశాఖ జంటనగరాల్లో ఐరిస్ పద్ధతిని అమలు చేయాలని చేస్తున్న రేషన్‌డీలర్ల సంఘం నేతలు తెలిపారు. ఇప్పటి వరకూ రేషన్‌షాపుల్లో సరుకులు తీసుకునేందుకు బయోమెట్రిక్ యంత్రంలో చేతి ముద్రలు తీసుకుని సరుకుల పంపిణీ చేసేవారు..ఐరిస్ విధానంలో ఇప్పటికే తీసుకున్న ఆధార్ కార్డులను బయోమెట్రిక్ యంత్రానికి అనుసంధానం చేసి..ఆధార్ తీసుకునే సమయంలో అప్పటికే ఐరిస్ పద్ధతిలో కనుపాపలను ఫొటోతీసి ఉంచడం వల్ల ఆధార్‌కార్డులోని ఆ ఫొటో ద్వారా బయోమెట్రిక్ యంత్రంలోకి ముఖం పెట్టగానే మన వివరాలు ఈ-పాస్ లోకి వచ్చేస్తాయి. ఇలా ఆధార్‌కార్డును బయోమెట్రిక్‌కు అనుసంధానం చేసినా నేరుగా సరుకులు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. వేలి ముద్రల అవసరం ఉండదని సివిల్ సప్లై అధికారులు తెలిపారు.