రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుతాం : సీఎం కేసీఆర్
విద్యావైద్య రంగాల్లో మంచి పద్ధతులు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు.

విద్యావైద్య రంగాల్లో మంచి పద్ధతులు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు.
హైదరాబాద్ : విద్యావైద్య రంగాల్లో మంచి పద్ధతులు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుతామన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు కొన్ని ఉపాధ్యాయ సంఘాలకు ఇష్టం లేదు అయినా..వాటికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఉన్నత విద్యలో ప్రైవేట్ వ్యక్తలను భాగస్వామ్యం చేయాలని పిలుపు వస్తుందని..దాన్ని ఆలోచిస్తున్నామని తెలిపారు. వైద్య రంగంలో కేరళకు మొదటి స్థానం, తమిళనాడుకు రెండో స్థానం, తెలంగాణకు మూడో స్థానం వచ్చిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలో ఆవాస ప్రాంతాలు 23 వేల 968 ఉన్నాయని తెలిపారు. కళ్యాణలక్మీ ద్వారా పేదలకు మేలు జరగడమే కాకుండా సాంఘీక దురాచారం అరికట్టబడుతుందన్నారు. బాల్య వివాహాలను చాలా వరకు నిరోధించగల్గుతున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణను చాలా ప్రయారిటీ అంశమని తెలిపారు. అడవుల నరికివేతను ఆపడంతోపాటు సోషల్ ఫారెస్టును పెద్ద ఎత్తున పెంచాలన్నారు. అందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సంవత్సరానికి కోటి మొక్కల చొప్పున నాటాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ హయాంలో మతకల్లోలాలు చెలరేగలేదని, టెర్రరిస్టుల దుశ్యర్యలు రాలేదన్నారు. శాంతి భద్రతలు పటిష్టంగా అమలు చేయపడుతున్నాయని తెలిపారు. త్వరలో దేశం గర్వపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ బిల్డింగ్ హైదరాబాద్ నడిబొడ్డున నిర్మాణం అవుతోందని.. రెండు, మూడు నెలల్లో బిల్డింగ్ ను ప్రారంభిస్తామని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని…ఎట్టిపరిస్థితుల్లో రాజీపడబోమన్నారు.