తెలంగాణను సెక్యులర్ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తాం : సీఎం కేసీఆర్

తెలంగాణను సెక్యులర్ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొని, మాట్లాడుతూ క్రైస్తవులకు అన్ని రకాలుగా లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 03:50 PM IST
తెలంగాణను సెక్యులర్ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తాం : సీఎం కేసీఆర్

Updated On : December 20, 2019 / 3:50 PM IST

తెలంగాణను సెక్యులర్ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొని, మాట్లాడుతూ క్రైస్తవులకు అన్ని రకాలుగా లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు.

తెలంగాణను సెక్యులర్ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం (డిసెంబర్ 20, 2019) హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొని, మాట్లాడుతూ క్రైస్తవులకు అన్ని రకాలుగా లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. క్రైస్తవ పెద్దలకు వారం రోజుల్లోగా అపాయింట్ మెంట్ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ఆధారణ లభిస్తుందన్నారు. అన్ని పండుగలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. 

ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకలకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. వేదికపై క్రిస్మస్ ట్రీని వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు బహుమతులు అందజేశారు. క్రిస్టియన్లకు క్రిస్మస్‌ ఫీస్ట్‌, దుస్తులు, బహుమతులు అందజేశారు. అనంతరం జరిగే విందులో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొన్నారు. 

క్రిస్మస్‌ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విందును ఇచ్చింది. హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ఐదేళ్లుగా క్రిస్మస్‌ విందును నిర్వహిస్తోంది. విందు విజయవంతానికి 14 శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.