కుక్క పిల్లలను కాటేసిన నాగు పాము

హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌ నాగోల్‌ లో పాము కాటుతో రెండు కుక్కపిల్లలు మరణించగా మరొకటి ప్రాణాలతో భయటపడింది. ఇంకా కళ్లు కూడా తెరవని కుక్క పిల్లల్ని కాటువేయడం చూసి స్థానికులు చలించిపోయారు.  

  • Published By: veegamteam ,Published On : October 12, 2019 / 01:57 PM IST
కుక్క పిల్లలను కాటేసిన నాగు పాము

Updated On : October 12, 2019 / 1:57 PM IST

హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌ నాగోల్‌ లో పాము కాటుతో రెండు కుక్కపిల్లలు మరణించగా మరొకటి ప్రాణాలతో భయటపడింది. ఇంకా కళ్లు కూడా తెరవని కుక్క పిల్లల్ని కాటువేయడం చూసి స్థానికులు చలించిపోయారు.
 

పిల్లలకు ఆపద వస్తే ఏ తల్లి అయినా పులిలా విరుచుకుపడుతుంది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతుంది. అలానే హైదరాబాద్‌లో ఓ కుక్క తన బిడ్డలను పాము నుంచి కాపాడుకునేందుకు పాముతో పోరాడింది. బిగ్గరగా అరుస్తూ… పామును దగ్గరకు రానీయకుండా ఆపేసింది. అయినా పాము కాటుతో రెండు కుక్కపిల్లలు మరణించగా మరొకటి ప్రాణాలతో భయటపడింది. 
 
హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌ నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయానికి సమీపంలో పెద్ద ఖాళీ స్థలం ఉంది. అక్కడ రెండు రోజుల క్రితం ఓ కుక్క మూడు పిల్లలకు జన్మనిచ్చింది. వాటి అలికిడి విన్న పెద్ద పాము అక్కడికి వచ్చింది. తన బిడ్డల్ని కాటు వేయబోయిన పామును చూసి తల్లి కుక్క బిగ్గరగా అరవడం ప్రారంభించింది. కుక్క అరుస్తూ పామును వాటి దగ్గరకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. 

ఈ అరుపులు విన్న వెంటనే స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా పాము కుక్క పిల్లలను కాటు వేస్తూ కనిపించింది. వారు పామును బెదరగొట్టి అక్కడి నుంచి పంపించి వేశారు. అప్పటికే  రెండు పిల్లల్ని కాటేయడంతో అవి చనిపోయాయి. ఇంకా కళ్లు కూడా తెరవని కుక్క పిల్లల్ని కాటువేయడం చూసి స్థానికులు చలించిపోయారు.