తల్లి మనస్సు చాటుకున్న మహిళా పోలీసు

చేసేది పోలీసు ఉద్యోగమే.. ఎంతైనా తల్లి మనస్సు కదా.. కంటి ముందు రెండేళ్ల పాప తల్లి పాల కోసం అలమటించడం చూసి ఆ మహిళా పోలీసు మనస్సు తల్లడిల్లిపోయింది. వెంటనే ఆ పసికందుకు పాలు పట్టి తన తల్లి మనస్సును చాటుకుంది.

  • Published By: sreehari ,Published On : January 1, 2019 / 06:19 AM IST
తల్లి మనస్సు చాటుకున్న మహిళా పోలీసు

Updated On : January 1, 2019 / 6:19 AM IST

చేసేది పోలీసు ఉద్యోగమే.. ఎంతైనా తల్లి మనస్సు కదా.. కంటి ముందు రెండేళ్ల పాప తల్లి పాల కోసం అలమటించడం చూసి ఆ మహిళా పోలీసు మనస్సు తల్లడిల్లిపోయింది. వెంటనే ఆ పసికందుకు పాలు పట్టి తన తల్లి మనస్సును చాటుకుంది.

  • రెండేళ్ల పసిపాపకు పాలిచ్చిన వైనం.. డిసెంబర్ 31 రాత్రి ఘటన.. 

చేసేది పోలీసు ఉద్యోగమే.. ఎంతైనా తల్లి మనస్సు కదా.. కంటి ముందు రెండేళ్ల పాప తల్లి పాల కోసం అలమటించడం చూసి ఆ మహిళా పోలీసు మనస్సు తల్లడిల్లిపోయింది. వెంటనే ఆ పసికందుకు పాలు పట్టి తన తల్లి మనస్సును చాటుకుంది. ఆమే హైదరాబాద్‌కు చెందిన మహిళా పోలీసు కె. ప్రియాంక. బేగంపేట 2014 బ్యాచ్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి కూడా బేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌లో ప్రియాంక డ్యూటీలో ఉన్నారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వద్ద ఏడుస్తున్న ఓ రెండేళ్ల పసికందు కనిపించిందని, అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు ప్రియాంకకు సమాచారం అందింది.

వెంటనే ఓ క్యాబ్ బుక్ చేసుకొని హుటాహుటిన ఆమె అఫ్జల్‌గంజ్ స్టేషన్ చేరుకున్నారు. అప్పటికే తల్లిపాల కోసం అలమటిస్తున్న పసిపాపను చూసి ప్రియాంక మనస్సు చెదిరిపోయింది. ఏడుస్తున్న ఆ పసిపాపను వెంటనే తన ఒడిలోకి తీసుకున్నారు. తానే తల్లిలా ఆ బిడ్డకు పాలు ఇచ్చి ఆకలి తీర్చింది. విధి నిర్వహణే కాదు.. సరైన సమయంలో పసిబిడ్డకు పాలిచ్చి కాపాడిన మహిళా కానిస్టేబుల్ ప్రియాంకను ఉన్నతాధికారులు ప్రశంసలతో ముంచెత్తారు.