కరోనా వైరస్ కలకలం : చైనా నుంచి హైదరాబాద్ వచ్చిన 32మందికి నోటీసులు

చైనాలోని వుహాన్(wuhan) నగరంలో పుట్టిన Coronavirus.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో విజృంభించిన కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది. ఇప్పటివరకు

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 10:02 AM IST
కరోనా వైరస్ కలకలం : చైనా నుంచి హైదరాబాద్ వచ్చిన 32మందికి నోటీసులు

Updated On : January 31, 2020 / 10:02 AM IST

చైనాలోని వుహాన్(wuhan) నగరంలో పుట్టిన Coronavirus.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో విజృంభించిన కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది. ఇప్పటివరకు

చైనాలోని వుహాన్(wuhan) నగరంలో పుట్టిన Coronavirus.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో విజృంభించిన కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వైరస్ సోకిన వారి సంఖ్య 8వేలకు చేరిందని చైనా ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. ఇటీవల చైనా నుంచి 32 మంది హైదరాబాద్ వచ్చారు. వారిని గుర్తించిన కేంద్రం.. వారందరికి నోటీసులు పంపింది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని నోటీసుల్లో తెలిపింది. పుణె నుంచి శుక్రవారం(జనవరి 31,2020) సాయంత్రానికి కరోనా వైరస్ టెస్ట్ కిట్స్ గాంధీ ఆసుపత్రికి చేరుకోకున్నాయి.

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులకు స్క్రీనింగ్ చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఐసోలేటేడ్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఒక్క రోజే 43మంది మృతి:
చైనాలో పుట్టిన కరోనా వైరస్(Coronavirus)… రోజురోజుకు ముదురుతూ అందరినీ గడగడలాడిస్తోంది. కోరలు చాస్తూ ఖండాంతరాలకు వ్యాపిస్తోంది. ఈ రాకాసి వైరస్ దెబ్బకు చైనాలో ఇప్పటికే 213 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య చైనాలో మొన్నటిదాకా 170 ఉండగా.. ఒక్క రోజు తేడాలో 213కు చేరిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో నిన్న ఒక్కరోజే 43మంది మృతి చెందారు. మరో 9692 మంది అస్వస్థకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 1,982 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. 

అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ:
కరోనా మహమ్మారి.. భూగోళాన్ని చుట్టుముట్టడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీని(Health Emergency) ప్రకటించింది. అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని, తక్షణ చర్యలను చేపట్టాలని సూచించింది. ఉమ్మడిగా ఎదుర్కొనడం ద్వారానే ఈ వైరస్‌ను నియంత్రించగలుగుతామని స్పష్టం చేసింది. 19 దేశాలకు ఈ వైరస్ విస్తరించడంతో.. ప్రపంచదేశాలు బయో సెక్యూరిటీ భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశాయి. అటు.. చైనాలో ఉన్న తమ దేశ పౌరులను తరలించేందుకు భారత్‌, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ ఏర్పాట్లు చేశాయి.

Also Read : Breaking News : కరోనాకు కారణం చైనాయే..ఇజ్రాయల్ నిపుణుడు