అసలేం జరిగిందంటే : హైదరాబాద్ లో 6 నెలల శిశువుకి కరోనా వైరస్

ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు కరోనా వైరస్.. హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. ఇప్పటికే పలువురు కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 05:50 AM IST
అసలేం జరిగిందంటే : హైదరాబాద్ లో 6 నెలల శిశువుకి కరోనా వైరస్

Updated On : February 6, 2020 / 5:50 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు కరోనా వైరస్.. హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. ఇప్పటికే పలువురు కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు కరోనా వైరస్.. హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. ఇప్పటికే పలువురు కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి నమూనాలు సేకరించిన డాక్టర్లు ల్యాబ్ కు పంపారు. అక్కడి నుంచి రిపోర్టులు రావాల్సి ఉంది. రిపోర్టులో ఏమొస్తుందోనని అంతా టెన్షన్ పడుతున్నారు. ఇది చాలదన్నట్టు.. ఓ ప్రైవేట్ ఆసుపత్రి రాసిన లేఖ మరో కలకలం రేపింది. ఆరు నెలల శిశువుకు కరోనా వైరస్ పాజిటివ్ అంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్.. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు లేఖ రాశారు. ఈ లేఖ సెన్సేషన్ గా మారింది.

ఆరు నెలల పాపకి వైరస్ లక్షణాలు ఉన్నాయని చెబుతూ.. గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేసింది ప్రైవేట్ ఆసుపత్రి. అయితే పాపకు పరీక్షలు నిర్వహించేందుకు గాంధీ వైద్యులు.. తర్జనభర్జన పడుతున్నారు. అదే సమయంలో దీనిపై మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రిలో వైరాలజీ ల్యాబ్ ఉండగా, ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు ఎలా చేశారని గాంధీ వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. వదంతులు సృష్టిస్తున్నారని అధికారులు మండిపడ్డారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.

గాంధీలో మరికొందరు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు. చైనా నుంచి వచ్చిన మరో ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే గాంధీలో ఐదుగురు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు. వారందరికీ ఐసోలేట్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో ఉండలేమంటూ కొందరు కరోనా వైరస్ అనుమానితులు పేచీ పెడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రాణాంతక కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్.. ప్రపంచ దేశాలకూ వేగంగా పాకింది. భారత్ సహా దాదాపు 30 దేశాల్లోకి కరోనా వ్యాపించింది. ఇప్పటివరకు 500మంది ప్రాణాలు తీసింది. 24వేల కరోనా కేసులు చైనాలో నమోదయ్యాయి. ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో లేకపోవడంతో రోజురోజుకీ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతుంది.

అప్పుడే పుట్టిన పిల్లలను కూడా ఈ వైరస్ వదలిపెట్టడం లేదు. చైనాలోని వుహాన్‌లో ఓ గర్భిణికి ఈ వైరస్ సోకగా.. ఆమెకు జన్మించిన బిడ్డకు కూడా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇలాంటి కేసు ఇదే మొదటిది కావడంతో ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. గర్భంలో ఉన్న శిశువుకి కూడా వైరస్ సోకడాన్ని నమ్మలేకపోతున్నారు.