GHMC యాక్షన్ ప్లాన్ : డెంగ్యూపై డ్రోన్ యుద్ధం 

  • Published By: madhu ,Published On : August 26, 2019 / 06:00 AM IST
GHMC యాక్షన్ ప్లాన్ : డెంగ్యూపై డ్రోన్ యుద్ధం 

Updated On : May 28, 2020 / 3:43 PM IST

అర అంగుళం లేని దోమ..ఎంతోమందిని బాధ పెడుతోంది. దోమ కాటు వల్ల రోగాల బారిన పడుతున్నారు రాష్ట్ర ప్రజలు. వైరల్ ఫీవర్స్ అధికమౌతుండడంతో హాస్పిటల్‌కు క్యూ కడుతున్నారు రోగులు. దీంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీనికి కారణం దోమలే. చెరువుల సమీపంలో నివాసం ఉంటున్న వారి సమస్య చెప్పనవసరం లేదు. ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుల్లో దోమలు అత్యధికంగా ఉంటాయి. ఇందులో ఉన్న గుర్రపు డెక్కను నిర్మూలించడం అధికారులకు తలనొప్పిగా మారింది. క్రిమి సంహారక మందులను చల్లినా దోమల బెడద తీరడం లేదు. దీంతో అధికారులు డ్రోన్ల సహాయం తీసుకోవాలని అనుకుంటున్నారు. 

పొలాలకు వినియోగించునట్లుగానే గుర్రపు డక్కలోని దోమలను నిర్మూలించేందుకు డ్రోన్లతో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లోని 195 చెరువులను శుభ్రం చేయడానికి డ్రోన్లను మోహరించాలని ఆలోచిస్తున్నారు అధికారులు. మియాపూర్ వద్దనున్న చెరువులో డ్రోన్లతో దోమల మందు చల్లే కార్యక్రమం సక్సెస్ అయ్యింది. 16 ఎకరాల్లో ఉన్న చెరువులో డ్రోన్ 20 లీటర్ల మందును కేవలం 4 గంటల్లో చల్లింది. ఫలితాలు అత్యుత్తమంగా ఉన్నాయని..కేవలం ఒక్క రోజులో చెరువును శుభ్రం చేయడం అసాధ్యమని..కానీ డ్రోన్ల సహాయంతో సాధ్యమైందన్నారు అధికారులు. 

చెరువులో పిచికారీ చేయాలంటే..కార్మికులకు ఎన్నో సమస్యలు తలెత్తవని..ఒక్కోసారి ప్రమాదాలు జరిగేవని తెలిపారు. మోకాలి లోతులో దిగి రావడం..ప్రమాదకరమని..కాలుష్యంతో పాటు..చర్మ సంబంధిత వ్యాధులతో బాధ పడే వారని జోనల్ కమిషనర్ హరిచందన వెల్లడించారు. దీనివల్ల సమయం..డబ్బు ఆదా అవుతోందన్నారు. గతంలో జేసీబీల కోసం రోజుకు రూ. 2 లక్షలు ఖర్చు పెట్టే వారమని..డ్రోన్ అద్దెకు తీసుకోవడానికి రోజుకు రూ. 20 వేలు అవుతోందని చె ప్పారు. కేవలం 3 నుంచి 4 రోజుల్లో చెరువులను డ్రోన్లతో శుభ్రం చేస్తున్నామన్నారు. 
Read More : నీలి విప్లవానికి శ్రీకారం: హైదరాబాద్ లో చేపల పెంపకం