ఎంజాయ్ : దసరా సెలవులు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 13 వరకు సెలవులు కొనసాగనున్నాయి. తిరిగి అక్టోబర్ 14 తిరిగి ప్రారంభం కానున్నాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు 16 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 09 వరకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది.
అయితే..ఏపీ రాష్ట్రంలో సెలవులు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు ప్రారంభమైనా..అక్టోబర్ 09 వరకు మాత్రమే సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 10న తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే..దసరా సెలవులను అక్టోబర్ 13 వరకు పొడిగించాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నట్లు టాక్. అక్టోబర్ 06న దుర్గాష్టమి, అక్టోబర్ 07న మహర్నవమి, అక్టోబర్ 08 విజయదశమి పర్వదినాలు రానున్నాయి.
సెలవులు పది కాలాల పాటు గుర్తిండిపోయేలా ఉంటాయి. ఉదయాన్నే లేవడం..స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు హాలీడేస్‌ను ఎంజాయ్ చేయాలని ప్లాన్ వేసుకుంటున్నారు. పుస్తకాలతో కుస్తీలు పట్టిన స్టూడెంట్స్ ఖుష్ అవుతున్నారు. కొంతమంది తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటికే రెడీ అయిపోయారు. మరికొంతమంది ఈ హాలీడేస్‌లో విహార యాత్రలకు వెళ్లేందుకు ఫిక్స్ అవుతున్నారు. దేవీ నవరాత్రలు కూడా సెప్టెంబర్ 28 నుంచి స్టార్ట్ కానున్నాయి. దీంతో పలువురు ప్రముఖ ఆలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. పట్నంలో ఉండేవాళ్లు పల్లెటూళ్ల వెంట పరుగులు తీస్తున్నారు.
Read More : తీరొక్క పూలు..కోటి కాంతులు : ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు షురూ