మరగుజ్జులకు T.RTC గుడ్ న్యూస్: ఉచిత ప్రయాణం

హైదరాబాద్ : మరుగుజ్జులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మరుగుజ్జులకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. హైదరాబాద్, వరంగల్‌లోని ఆర్డినరీ సిటీ బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. అంతేకాదు..ఇతర ప్రాంతాల్లో ప్రయాణించే మరగుజ్జులకు 50 శాతంతో రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో కొన్ని షరతులు కూడా విధించింది. అదే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
మరుగుజ్జుతనం 70 శాతం ఎముకలు సరిగ్గా పెరగకుండా ఉండటం వల్ల వస్తుందని నిపుణులు చెబుతుంటారు. దీనినే మెడికల్ లాంగ్వేజ్ లో అకోండ్రోప్లేసియా అంటారు. శరీరంలోని మిగతా భాగాలతో పోలిస్తే ఎముకల పెరుగుదల తక్కువగా ఉండటంతో మరగుజ్జుతం ఏర్పడుతుందని చెబుతారు. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం మరగుజ్జులతో కామెడీ చేయిస్తుంటారు. పెళ్లిళ్లలో మరగుజ్జులకు బొమ్మలు తొడిగి పిల్లల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. సర్కస్ విషయం సరేసరి. ఇటువంటివారికి ఆదాయ వనరులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ క్రమంలో వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం వారికి ఆర్టీసీ బస్సులలో రాయితీలను ప్రకటించటం జరిగింది.